– ప్రజల సొమ్మంతా దోపిడీదారుల పాలవుతోంది
– టీడీపీ సీనియర్ నేత, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
నేడు అసెంబ్లీలో వైసీపీప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చీకటి బడ్జెట్ . చట్టసభలను గౌరవించకుండా, ఆర్థికక్రమశిక్షణ లేకుండా అంకెల గారడీచేశారుతప్ప, ఎక్కడా కేటాయింపులప్రకారం అన్నిశాఖలకు నిధులుకేటాయించే మార్గాలను విస్మరించారు. నీటిపారుదలరంగం సహా, వ్యవసాయం, సంక్షేమరంగాలను పూర్తిగా ప్రభుత్వం మోసగించిందనే చెప్పాలి. బడ్జెట్ పేరుతోగొప్పగా అంకెలు చెప్పడంతప్ప, ఆచరణలో అమలువిషయానికి వచ్చేసరికి ప్రభుత్వం చతికిలబడుతోంది. 2019-20లో మొత్తం బడ్జెట్ ను రూ.2లక్షల27,984కోట్లని ప్రకటించారు.
కానీ ఖర్చుచేసింది మాత్రం కేవలంలక్షా70,703కోట్లు మాత్రమే. రూ.53వేలకోట్ల వరకు ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా తగ్గించారు. అలానే 2020-21 బడ్జెట్ ని గమనిస్తే, రూ.2లక్షల24,789కోట్లుగా ప్రకటించారు. ఖర్చులకు వచ్చేసరికి రూ.లక్షా87వేలకోట్లు మాత్రమేఖర్చు పెట్టారు. అసలు బడ్జెట్ కేటాయింపులతోసంబంధంలేకుండా, లెక్కా పత్రం లేకుండా డబ్బుఖర్చుచేస్తున్నారు.
లక్షలకోట్లు అప్పులుతెస్తూ, సంక్షేమాన్ని విస్మరిస్తూ, కేంద్రప్రభుత్వపథకాలకే పేర్లుమార్చి, తమవిగా ప్రభుత్వంచెప్పుకుంటున్నారు. కేంద్రప్రభు త్వంఇచ్చేదికాక, ఈ ప్రభుత్వంఎంత ఖర్చుచేస్తోందో చెప్పకపోతే ఎలా? చంద్రబాబుగారి హాయాంలో2018-19లో చేసిన కేటాయింపులు, ఖర్చు పెట్టిన నిధులపాటి కూడా ఈప్రభుత్వం ఖర్చుచేయ డం లేదు. గతంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేరుణపరపతి పెరిగింది. వ్యవసాయరంగానికి ఈ మూడేళ్లలో చేసిన కేటాయింపులు ఎన్ని.. ఖర్చుపెట్టిన నిధులెన్నో ప్రభుత్వం వాస్తవాలుచెప్పగలదా? నీటి పారుదల రంగంలో టీడీపీ ప్రభుత్వ హాయాంలో 2018-19లో రూ.14 వేలకోట్లుఖర్చుపెట్టాము.
ఈ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో నీటి పారుదలరంగానికి కనీసం రూ.10వేలకోట్లు కూడా ఖర్చుపెట్టలేదు . తాజాబడ్జెట్లోకూడా రూ.11వేలకోట్లు లెక్కలుచూపిస్తున్నారు. కానీ ఖర్చుకివచ్చేసరికి దానిలోసగంకూడా పెట్టరు. అనేకపథకా లకు సంబంధించి ప్రభుత్వం ఇలానే ప్రజలను మోసగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేనిధులతో పబ్బంగడుపుకుంటూ, ఆపథకాల పేర్లు మారుస్తున్నారు. గ్రామీణాభివృద్ధికి టీడీపీహాయాంలో 2018-19లో రూ.26,411కోట్లు ఖర్చుచేస్తే, 2019-20లో ఈ ప్రభుత్వం రూ.10,425కోట్లు మాత్రమే వెచ్చించింది.
ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్లో రూ.13వేలకోట్లు కేటాయించారు. దానిలో ఎంతఖర్చుపెడ తారో చెప్పలేము. ఇలా ఈ ప్రభుత్వం ఆర్థికక్రమశిక్షణకు తిలోదకా లుఇచ్చి, ఆర్థికఉగ్రవాదానికి పాల్పడుతోంది. మంత్రి బుగ్గన ఢిల్లీ చుట్టూ తిరిగి అప్పులు తేవడంపై శ్రద్ధ చూపుతున్నారు తప్ప, రాష్ట్రంలో కేటాయింపులు, ఖర్చులపై ఆలోచన చేయడం లేదు. లక్షా26వేలకోట్ల వరకు ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బకాయి ఉంది.
ఆ సొమ్ముని బడ్జెట్లో ఎందుకు చూపించరు? డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా, కార్పొరేషన్లద్వారా ఎంత అప్పు తెచ్చారనే వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలోఎందుకు చెప్పడంలేదు? గతప్రభుత్వంలోని బాండ్లన్నిం టినీ తనఖాపెట్టేసి మరీ అప్పులు తెస్తున్నారు. ఎక్కడా ఒక్క ఊళ్లోకూడా ఒక్కరోడ్డు వేసిందిలేదు. ఈప్రభుత్వం రద్దయ్యేవరకు అన్నింటినీ రద్దుచేస్తూనేఉంటుంది. చెత్తసహా అన్నింటిపై పన్నులు వేస్తూ ప్రజలనుంచి ముక్కుపిండి వసూలుచేస్తున్నసొమ్మంతా ఎటుపోతోంది?
ప్రభుత్వంలో అన్నిరకాల మాఫియాలు పెరిగిపో యాయి. మైనింగ్ మాఫియా, మద్యంమాఫియా.. ఇసుక మాఫి యా..ఖనిజసంపదనుదోచేసే మాఫియా ఇలా అంతా మాఫియా ప్రభుత్వమే. జగన్ రెడ్డి హయాంలో పౌరుల తలసరి అప్పు ఏటేటా పెరుగుతోంది.. ప్రజలఆదా యంమాత్రం పెరగడంలేదు. ఈడీకేసు లున్న వ్యక్తి సారథ్యంలో రాష్ట్రసంపదకొల్లగొట్టబడుతోంది. ప్రభుత్వ సొమ్ము..అంటేప్రజలసొమ్ము దోపిడీదారుల పాలవుతోంది.