Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలి

– సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లేఖ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఒక లేఖ రాశారు. పాఠకులకు ఆ లేఖ యథాతథంగా…

గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గార్లలకు
విద్యార్థి తల్లిదండ్రుల లేఖ…

రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వైద్య విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పీజీ మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ వైద్య కమిషన్ కు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నాం. ఎంబీబీఎస్‌ తర్వాత పీజీ చదివితేనే మంచి అవకాశాలు వస్తుండగా రాష్ట్రంలో 1:4 నిష్పత్తిలో పీజీ వైద్య విద్య సీట్ల కొరత ఉంది.

జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) యూజీ లేకుండానే పీజీ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నది. రాష్ట్రంలో అన్ని జిల్లాల లోని 200 పడకలతో ఉన్న ఆసుపత్రులను పీజీ కోర్సుల కోసం బోధనాసుపత్రులుగా మార్పు చేయాలని కోరుతున్నాము. వందలాది మంది రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పీజీ విద్య అభ్యసించేందుకు రాష్ట్రంలో ఈ తరహాలో ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలల ఏర్పాటు కు అనువైన అవకాశాలు ఉన్నందున రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మన విద్యార్థుల విద్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నాము.

అభివందనములతో
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)
ఆంధ్రప్రదేశ్ కమిటీ

మలి రెడ్డి కోటా రెడ్డి బీఎల్‌, రాష్ట్ర గౌరవాధ్యక్షులు

నరహరి. యస్ రాష్ట్ర అధ్యక్షులు
జీ.ఈశ్వరయ్య రాష్ట్ర కార్యదర్శి
ఎం.డి యూనస్ అలీ, చీఫ్ బయోకెమిస్ట్,
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు.
డాక్టర్ వి భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
====================

LEAVE A RESPONSE