– సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వ నూరు రోజుల పాలన
– నూజివీడు మండలంలో రూ.43.50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
– నూజివీడు మండలంలోని పలు గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొలుసు పార్ధసారధి
నూజివీడు/ఏలూరు : రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఘనమైన విజయాన్ని అందించారని ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం విజయంగా భావించకుండా బాధ్యతగా భావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.
సోమవారం నూజివీడు మండలం సుంకొల్లు ,యనమందల,బత్తులవారి గూడెం గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి 100 రోజుల్లో ఎన్ .డి. ఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి వివరించారు. అక్కడ ప్రజల సమస్యలను మంత్రి పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. నూజివీడు మండలంలో రూ. 43.50, లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పార్థసారథి శంఖుస్ధాపన చేశారు.
నూజివీడు మండలం యనమందల గ్రామంలో రూ. 15 లక్షల తో నిర్మించే సిమెంట్ రోడ్డు, సుంకొల్లు గ్రామంలో రూ.7.50 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డు, బత్తులవారిగూడెం లో రూ. 21 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. 100 రోజులు పూర్తిచేసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలచేత అనిపించుకుంటుందని తెలిపారు.
సుంకొల్లు, యనమందల, బత్తులవారి గూడెం గ్రామాలలో పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొని రాగా వెంటనే సమస్యలు పరిష్కరించమని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుంకొల్లు గ్రామంలో త్రాగునీటి, సమస్య, డ్రైనేజీ సమస్య, సిసి రోడ్ల సమస్య మరియు సాగునీటి సమస్య విద్యుత్ స్తంభాల ,ఇండ్ల స్థలాల సమస్య,ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించిన మంత్రికి గ్రామస్తులు తమ హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
యనమందలలో వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, హరిజన వాడలో ఇళ్ల స్థలాలు, మురుగునీరు, దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులుకు మంత్రి ఆదేశించారు.
సుంకొల్లు గ్రామంలో ఉపాధిహామీ పనుల్లో అవకతవకలపై అరా తీయగా రూ. 24లక్షల నూజివీడు మండలంలోరూ.
64 లక్షల పక్కదారి పట్టినట్లు గమనించిన మంత్రి ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి ఫీల్డ్ అసిస్టెంట్ , ఇతర అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి నిధులు మొత్తం రికవరీ చేయాలని డ్వామా పిడి ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఆదేశించారు. గ్రామంలో జాబ్ కార్డు లేకుండా సంతకాలు లేకుండా డ్రా చేసిన నిధులు రికవరీ చేసి అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.