Suryaa.co.in

Editorial

వేమగిరిలో మళ్లీ గ్రావెల్ దందా

– ఇళ్ల స్థలాల సదును పేరిట గ్రావెల్ తరలింపు
– గోతులుగా మారుతున్న నిరుపేద స్థలాలు
– అయినా చోద్యం చూస్తున్న అధికారులు
(మార్తి సుబ్రహ్మణ్యం)
వేమగిరిలో గ్రావెల్ దందా మళ్లీ మొదలైనది.ఇళ్ల స్థలాల చదును పేరిట కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్ ను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు.దీనిపై కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి ప్రసాద్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.వేమగిరి R. S .no 204 లో 23 ఎకరాల జిల్లా పరిషత్ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిలో లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఉంది.దీనిపై కన్నేసిన కొందరుగ్రావెల్ ను మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముకోవడానికి,ప్రైవేట్ సైట్లు ఫిల్లింగులు చేసుకోవడానికి స్కెచ్ వేశారు.
జిల్లాలో పేదలకు కేటాయించిన అన్ని ప్రభుత్వ స్థలాలు చదును పనులు పూర్తయ్యాయి కానీ రెండున్నర ఏళ్లుగా తవ్వుతున్నా వేమగిరి లేఅవుట్ మాత్రం పూర్తికారావడం లేదు.పని పూర్తయితే గ్రావెల్ తరలింపునకు అవకాశం ఉండదని ఆమూల కొంత పని,ఈ మూల కొంత పని..ఆలాని ఎంతో కొంత చదును అవుతుందా అంటే .. ఆ ప్రాంతం ఎందుకు కొరగాకుండా గోతులు పెడుతున్నారు. ఈ బాగోతం పై గత ఏడాది ఇదే నెలలో మండల వై.సి. పీ కన్వీనర్ యాదల స్టాలిన్ బహిరంగంగానే గళమెత్తారు.
అధికారులకు ఫిర్యాదు చేశారు. తాత్కాలిక పర్మిట్ల తీసుకొని, అనుమతికి మించిన గ్రావెల్ ను తరలించుకుపోయిన తంతు బయటపడుతుందని అప్పట్లో పనులు ఆపేశారు.తాజాగా నాలుగు రోజుల నుండి మళ్లీ అడ్డగోలు గ్రావెల్ త్రవ్వకాలు మొదలయ్యాయి. దీనిపై మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి ప్రసాద్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కు,విజిలెన్స్, మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE