– నాడు మరాఠా బాల్ థాకరే నేడు కన్నడ పునీత్ రాజ్ కుమార్
పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు.. గొప్ప పుణ్యాత్ముడు..మరుపురాని మానవతావాది,హిందూ ధర్మ పరిరక్షకుడు, హైందవ ధర్మ వీరుడు..తళుకు బెళుకుల సినిమారంగంలో, పైసలు సంపాదించడమే తప్ప, విలువలు ఉండని ఒక రంగుల ప్రపంచంలో… విలువల కోసమే నిలబడిన ఒక గొప్ప మహానుభావుడు.. గొప్ప ధన్యజీవి.. కన్నడతో సహా తెలుగు రాష్ట్రాలు యావద్భారత దేశం అకాల మరణం పట్ల శోక సంద్రమై.. మహారాష్ట్ర సింహం,మొదటి తరం హైందవ ధర్మ వీరుడైన మహారాష్ట్ర బాల్థాకరే తర్వాత.. అంతటి నీరాజనం జనసంద్రం.. పునీత్ రాజ్కుమార్ విషయంలో కనబడింది.
బాల్ థాకరే మరణం తర్వాత మహారాష్ట్ర స్తంభించింది, వీర శివాజీ నీ కోల్పోయినట్టుగా బాధపడితే.. ఇప్పుడు పునీత్ రాజ్కుమార్ విషయంలో యావత్ ఎంతో బాధపడి దుఃఖించింది.. ప్రజలలో ఇంతటి అభిమానము ఏ సినీ తారకు చెందలేదు, ఇతని పార్థివదేహాన్ని లక్షమంది CAPACITY గల స్టేడియంలో ఉంచిన,అంతకు100 రెట్లు జనం వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు..లక్షలాదిమంది కడసారి కన్నీటి నివాళ్ల తో మొత్తం కన్నడ రాష్ట్రమే స్తంభించిపోయింది,రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఒక సినీ తార కోసం, అతని కడసారి కన్నీటి నివాళి కోసం పని చేయవలసి వచ్చింది యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా అదే పని లో ఉండిపోయింది..ఎందుకంటే ప్రజలకు ఇతని గురించి అవసరం కాబట్టి, యావత్ యంత్రాంగమంతా ఇతడి కోసమే పని చేసింది..
తన సంపాదనలో ఎక్కువగా భాగం ధర్మకార్యాలు, పుణ్య కార్యాలకు ఉపయోగించిన గొప్ప నటుడు, ధన్యజీవి, కర్ణాటకలో 50 పాఠశాలలు, 30 అనాధాశ్రమాలు, 20 వృద్ధాశ్రమాలు, 20 గోశాలలు, వేల మంది విద్యార్థులకు ఉచిత ఆర్థిక సహాయం, ఆడపిల్లలకు చదువులకు ఆర్థిక సహాయం, ఇలా తన సంపాదనలో కోట్ల రూపాయలకు సమాజసేవకులు వినియోగిస్తూ ఎంతో ధర్మబద్ధంగా జీవించిన హైందవ ధర్మ వీరుడు..చివరికి తన రెండు కళ్ళను కూడా దానం చేసిన..నేటి కలియుగ కాలానికి మరో దాన కర్ణుడు, మహానుభావుడు,పుణ్యజీవి పునీత్ రాజ్కుమార్.
కోట్లాది మంది ఆదరణ పొందిన పునీత్ కుమార్ ధన్యజీవి,కన్నడ కంఠీరవడు అనగా శివుడు ప్రఖ్యాత నటుడు రాజ్ కుమార్ యొక్క పుత్రుడు పునీత్ పుణ్యకార్యాలతో ధన్యజీవి అయ్యాడు.కన్నడ భాషలో మీలో ఎవరు ఎవరు కోటీశ్వరుడు కోసం వ్యాఖ్యాతగా పనిచేసిన పునీత్ కుమార్, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పని చేయాలని టీవీ యాజమాన్యం కోరిన, ప్రశ్నలు అడగమని చెబితే తిరస్కరించాడు..CRORES రూపాయల పారితోషకం వదిలి ప్రోగ్రాంని వదిలివేయాలి అనుకున్నాడు..దెబ్బకి టీవీ యాజమాన్యం కాళ్లు మొక్కి క్షమాపణలు కోరింది.. మనసా, వాచా, కర్మణా హిందూ ధర్మ పరిరక్షణకు, హైందవ ధర్మ విలువలకు వాటిని కాపాడడానికి గొప్పగా పనిచేసిన హైందవ సింహం, వీరుడు పునీత్ రాజకుమార్.
ఇస్లామిక్ మతోన్మాద జిహాదీల కాలంలో, క్రైస్తవ మాఫియా పిచ్చి కాలంలో, కేవలం దోచుకు తినే దొంగల సినీతారల రంగంలో.. విలువలు ఎంత మాత్రం, ఏమాత్రం పాటించని కుళ్ళు సమాజంలో.. ఎంతో గొప్పగా దానధర్మాల వీరుడుగా బ్రతికి చూపించిన పునీత్ రాజ్ కుమార్… ఇటీవల కాలంలో ఇంత ధన్యజీవి, పుణ్యజీవి ఎక్కడా కనబడలేదు. ఇతడి అకాల మృత్యువు ఎందరికో, గుండెకోత తీరని బాధ సౌక సంద్రాన్ని మిగిలించింది..పునీత్ రాజ్కుమార్ పుణ్యజీవి, మహానుభావుడు హిందూ ధర్మ వీరుడు, హైందవ ధర్మ సింహం.. అతని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి అని, అతనికి కైవల్య ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని, కైలాస వాసంలో ఉండాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ.. ఓం శాంతి,శాంతి, శాంతి…
– శాయిరి రాజేశ్వర్,మెదక్