విద్యార్థి- ఆవేదన

పూట పూట కడుపు నింపే గోరు ముద్దలు కన్న
బతుకంతా కడుపు నింపే బడి పాఠాలే మిన్న
మిలమిల మెరిసే మరుగు దొడ్ల కన్న
విలువలు పెంచే గురువుల పాఠాలు మిన్న
ఉచిత విద్యా కానుకలు ఎన్ని ఇచ్చినా
ఉన్నత బోధనా కానుకలు కావాలి అన్నా
బడికి రప్పించే ప్రోత్సాహకాలు ఎన్ని కల్పించినా
బడిలో పాఠాలు లేకుంటే మా బతుకు సున్న
సమావేశాలు, గణాంకాలు, యాప్ లు ,స్నాప్ లు
మా పాఠాలు కు మాకు దూరమవుతున్న గురువులు
ఉత్సవాలకు ఊరేగింపులుకు సగం రోజులు ప్రత్యేకం
ఉత్సవ విగ్రహాలుగా మిగులుతామేమో అని సందేహం
భౌతిక వసతులు పైన ఎనలేని ఆసక్తి పర్యవేక్షణ
మౌలిక అంశాలపై దిశ లేని నిరాసక్తి నిర్వేదన
నూటికి ఒక్క విజేత లతో గొప్ప ప్రచార ఆర్భాటం
నానాటికీ తీసు కట్టు మార్పుల చేర్పుల ప్రహసనం
ఎగువ స్థాయికి ప్రైవేట్ వారితో పోటీ పడలేము
దిగువ స్థాయి పని వారీగా మరలా మిగులుతాము
మాటలు కోటలు దాటుటే కానీ
మా రాతలలో మార్పులు గడప దాటవు

– బాలమురళీకృష్ణ

Leave a Reply