– సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
ఢిల్లీ: వివాదాస్పదంగా మారిన గ్రూప్ -1 పరీక్షల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. గ్రూప్ -1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
గ్రూప్ -1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును బాధితులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.