Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల .. అనుబంధ వ్యయాలకు – దొంగలెక్కలకు చాలా తేడా ఉంది

– మీరు మాట్లాడే మాటలు, మీ తీరు చూస్తుంటే ఆర్ధిక నిపుణులకు సైతం పిచ్చెక్కేలా ఉంది
– రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలపై మీరు మాట్లాడకపోతే మంచిది
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జి.వి రెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డి అనుబంధ వ్యయాలకు (సప్లిమెంటరీ ఎక్పెండిచర్) బడ్జెట్ అనుమతి లేకుండా చేసిన దొంగ లెక్కలకు తేడా లేనట్లు మాట్లాడుతున్నాడు. టిడిపి హయాంలో రూ.1.62 వేల కోట్లకు సంబంధించి పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమాధానం సప్లిమెంటరీ ఎక్సెండిచర్ కి సంబంధించినది. దీనిపై టిడిపి ఎప్పుడు ప్రశ్నించలేదు. మొదటి నుంచి టిడిపి ప్రశ్నిస్తున్నది బిల్లులు లేకుండా దొడ్డిదారిన చెల్లించిన దొంగ లెక్కల పైనే.

అనుబంధ వ్యయం కేవలం టిడిపి హయాంలో మాత్రమే జరగలేదు. వైసీపీ ప్రభుత్వం మొదటి రెండేళ్లలోనే అనుబంధ వ్యయం దాదాపు రూ. 1,22,740 కోట్లు ఖర్చు చేసింది. 2019-20 లో రూ. 73,983 కోట్లు, 2020-21 లో రూ. 48,757 కోట్లు ఖర్చు చేసింది. టిడిపి హయాంలో జరిగింది అవినీతి అయితే ఈ రెండు సంవత్సరాలలో వైసీపీ చేసింది కూడా అవినీతి అని సజ్జల ఒప్పుకుంటారా? వంద ఖర్చు చేస్తే వెయ్యి అవినీతి చేశామని ప్రతిపక్షంలో ఉండి పుస్తకాలు వేసి పంచిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లైనా టిడిపి హయాంలో రూ. 1.62 లక్షల కోట్ల అవినీతి జరిగితే ఎందుకు కనిపెట్టలేకపోయింది? కొండను తవ్వి ఎలుకను పట్టుకునే అలవాటున్న వైసీపీ ఎందుకు మూడేళ్లలో ఎలుకను ఎందుకు పట్టుకోలేకపోయింది?

సజ్జల ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదు. ఒక ప్రక్క రాష్రంవా చాలా బాగుంది అని అంటున్నాడు. మరో ప్రక్క రాష్ట్రం క్రైసిస్ లో ఉంది కాబట్టే ఎక్కువ అప్పులు చేస్తున్నామని చెబుతాడు. టిడిపి ఎఫ్.ఆర్.బి.ఎం కు మించి అప్పులు చేసిందని చెబుతున్నాడు. తమదాక వచ్చే సరికి ఎఫ్.ఆర్.బి.ఎం కు మించి అప్పులు చేయడం ఏ ప్రభుత్వంకు అవకాశం ఉండదని చెబుతున్నాడు… సజ్జల మాటలు, ఆయన తీరు ఆర్ధిక మేధావులకు కూడా పిచ్చెక్కించేలా ఉన్నాయి. శ్రీలంక లాంటి సంక్షోభ పరిస్థితులు ఏపీలో ఉన్నాయని టిడిపి మొదటి నుంచి చెబుతుంది. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నట్లు సజ్జల ఒప్పుకుంటున్నాడో లేదో ముందు తేల్చి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది.

ఇప్పటికి అనేకమార్లు రాష్ట్రం రూ 8.50 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని లెక్కలతో సహా వేసి చూపిస్తే దానికి సమాధానం చెప్పకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.3.14 లక్షల కోట్లు మాత్రమే అప్పుల ఉంటే వైసీపీ ప్రభుత్వం కేవలం మూడేళ్లలో రూ.5.36 లక్షల కోట్లు అప్పు చేసింది. వైసీపీ ప్రభుత్వం దమ్ముంటే బడ్జటేతర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

సజ్జలకు, జగన్ రెడ్డికి ఏమాత్రం పారదర్శకత ఉన్నా 2021 ఆగష్టు నుంచి జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారు?టిడిపి ప్రభుత్వం వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమం చేయడంతో పాటు అభివృద్ధి చేసింది. టిడిపి-వైసీపీ సంక్షేమ నిష్ఫత్తి 41:39. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం లేదు. అభివృద్ధి లేదు. వైసీపీ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో, ప్రజలపై మోయలేని భారాలు మోపి సంక్షేమం చేయడం దుర్మార్గం. సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు.

LEAVE A RESPONSE