సగం పూర్తయిన జోజిలా టన్నెల్‌ పనులు

• మంచువర్షాలు, ప్రతికూల వాతావరణంలో నిరాటంకంగా టన్నెల్ పనులు
• వేగంగా కొనసాగుతున్నఈ అతి భారీ చారిత్రక టన్నెల్‌ పనులు
• 7 కిలోమీటర్ల మేర పూర్తయిన టన్నెల్ తవ్వకం
• పనుల కోసం సరికొత్త టెక్నాలజీ వినియోగం

మౌలిక వసతుల రంగంలో అగ్రగామి సంస్థ, మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్) జోజిలా టన్నెల్ తవ్వకం పనులను అతి స్వల్ప కాలంలో సగం మేర పూర్తి చేసింది. హిమాలయాల్లో , నిరంతరంగా కురుస్తున్న మంచుతో పాటు తరచుగా వచ్చే మంచు తుపానుల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప‌నుల‌ను వేగ‌వంతంగా కొన‌సాగిస్తోంది.

శ్రీనగర్-లద్దాక్‌ల మధ్య అన్ని కాలాల్లోనూ నిరంతర రాకపోకలను సాగించేందుకు వీలుగా నిర్మిస్తున్న ఈ టన్నెల్‌‌ నిర్మాణాన్ని భారీ హిమాలయ పర్వత శ్రేణులను తొలిచి వేగంగా పనులను చేస్తూ ఎంఈఐఎల్ తన
t5 సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఇలాంటి భౌగోళిక ప్రాంతంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈమేరకు పనులను పూర్తి చేయడం ప్రపంచంలోనే తొలిసారి. ఆసియాలోనే అతి పోడవైన, రెండు వైపులా ప్రయాణించేగలిగే ఈ టన్నెల్‌ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐడీసిఎల్‌) కోసం ఎంఈఐఎల్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. కేంద్ర రవాణా, రోడ్‌ వేస్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ జోజిలా టన్నెల్‌ పనులను గతంలో ప్రారంభించారు.

శ్రీనగర్‌-లేహ్ నగరాల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు వ్యూహాత్మకమైనది. సిల్క్‌ రూట్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ సొరంగ మార్గం దేశ రక్షణకు కీలకం కాగా, హిమాలయ ప్రాంత ఆర్థికాభివృద్దికి చాలా ముఖ్యమైనది.జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్ ప్రాంతాల సమీకృత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకం కానుంది.

ఎంఈఐఎల్ తనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యం, అనుభంతో జోజిలా ప్రాజెక్టును నిర్మిస్తున్నది. న్యూ ఆస్ట్రియన్‌ టన్నెలింగ్‌ మెథడ్‌ (ఎన్‌ఏటీఎం), స్నోబ్లోయర్స్, పేవర్స్‌, స్పెషలైజ్డ్‌ బూమర్స్ వంటి అత్యాధునిక యంత్రాలను, ఇంజినిరింగ్‌ పద్ధతులను వినియోగిస్తున్నది.

అత్యంత ఎత్తైన ప్రాంతంలో మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా ఎంఈఐఎల్ ప్రాజెక్టు పనులను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తోంది. నిజానికి, కఠినమైన రాళ్ళు, భారీగా సీపేజీ ఉన్న భూభాగంలో
t3 డ్రిల్లింగ్‌తో పాటు సివిల్‌‌వర్క్స్‌ను చేయడం చాలా కఠినమైన పని. కానీ, క్లిష్టమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంలో ఎంఈఐఎల్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ ప్రాజెక్టును కూడా నిబద్దతతో పూర్తి చేస్తున్నది.

ఇప్పటి వరకు టన్నెల్‌ తవ్వకం పనులు సగం వరకు, 7,000 మీటర్లు (7కీ.మీ) మేర పూర్తయ్యాయి. జోజిలా రూట్‌లో నదిని దాటడానికి 815 మీటర్ల పొడవున నాలుగు బ్రిడ్జిలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. బ్రిడ్జీల నిర్మాణం కోసం సబ్‌ స్ట్రక్చర్స్‌, ఫౌండేషన్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ హెడ్ హర్‌పాల్‌ సింగ్‌,మాట్లాడుతూ, “దేశం మొత్తం అసాధ్యమనుకున్న దాన్ని మేం సాధించగలిగాం. మీనామార్గ్‌ పరిసరాల్లోని సైనిక సిబ్బంది, పోలీసులు,
t2
వైద్య సిబ్బంది, అనేక మంది స్థానికులు చ‌లికాలంలో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లారు. అంకితభావంతో ఉన్న ఎంఈఐఎల్‌ సిబ్బంది మాత్రం టన్నెల్‌ తవ్వకం పనులను ‎ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించారు. ప్రతి ఒక్కరూ ప్రాజెక్టు పురోగతితో ఉప్పొంగిపోతున్నారు.

ఈ సొరంగ మార్గాలు, జింకలు, ఇతర జంతువులకు తలదాచుకునే స్థావరాలుగా మారాయి. ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలు, ఐఐటి ఢిల్లీ, ఐఐటీ శ్రీనగర్‌లు మా పనులను పర్యవేక్షిస్తున్నాయి. ప్రాజెక్టు పనుల్లో మా సాంకేతిక పరిజ్ఘానం, పాటిస్తున్న ప్రమాణాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాయి.” అని అన్నారు.

గతంలో ఇత‌రులు రెండేళ్ళలో కేవలం 15 మీటర్ల పనులు మాత్రమే చేయ‌గా, ఎంఈఐఎల్ ఈ పనులను చేపట్టిన తర్వాత కేవలం సంవత్సరన్నర కాలంలో ఏడు కిలోమీటర్ల మేర పూర్తి చేయగలిగింది. అత్యంత చలికాలంలోనూ కూడా మూడున్నర కిలోమీటర్ల పనులను పూర్తి చేసింది. గత ఏడాది అక్టోబర్‌ 21న 16 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 24 మంది పోలీసులు మంచులో చిక్కుకుపోతే, కేవలం అరగంట వ్యవధిలో ఎంఈఐఎల్‌ సిబ్బంది అక్కడికి వెళ్లి వారిని కాపాడిన విషయాన్ని ఈసంద‌ర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

జోజిలా టన్నెల్‌ సాంకేతిక వివరాలు
ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 18 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్‌ (T1, T2, T3) నిర్మాణంతో పాటు 17 కిలోమీటర్ల రోడ్డు, మూడు వెర్టికల్‌ షాఫ్ట్‌లు, సంబంధిత ఇతర స్ట్రక్చర్స్‌ ఉన్నాయి. ఒకటవ టన్నెల్‌‌
t4 (నీల్‌గ్రార్‌ టన్నెల్ 1) 468 మీటర్ల పొడవు ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌. రెండవ టన్నెల్‌ (నీల్‌గ్రార్‌ టన్నెల్‌ 2) 1976 మీటర్ల పొడవైన ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్. మూడవ టన్నెల్‌ (జోజిలా టన్నెల్) సింగిల్‌ ట్యూబ్‌ టన్నెల్‌ 13 కిలోమీటర్ల పొడవైనది. జోజిలా మెయిన్‌ టన్నెల్‌ (T3) ప్రాజెక్టులోనే అతి ముఖ్యమైనది. ఇది ద్రాస్‌ సమీపంలో తూర్పు వైపున బాల్టాల్‌ నుంచి ప్రారంభమై మీనా మార్గ్‌ వద్ద ముగుస్తుంది.

జో మోర్హ్ నుంచి బాల్టాల్‌ వరకు 17 కిలోమీటర్ల పొడవైన రోడ్డును కూడా ఎంఈఐఎల్‌ నిర్మిస్తున్నది. ఈ రోడ్డు పనులు కూడా దాదాపు 40 శాతం పూర్తయ్యాయి. సాధారణ పీఠభూమి, చదునైన ప్రాంతాలతో పోల్చితే
t మంచు కురిసే పర్వత ప్రాంతాలలో రోడ్డు నిర్మాణం, పూర్తిగా క్లిష్ట‌మైన‌ ప్రక్రియతో కూడుకున్నది. ఈ ప్రక్రియల్లో భాగంగా చదను చేయడంతో పాటు, గ్రబ్బింగ్‌ పనులు, భూతవ్వకం, గట్టుల నిర్మాణం, సబ్‌గ్రేడ్‌ ఏర్పాటు, పాలిస్టైరీన్‌ షీట్లు, సీటీఎస్‌బీ లేయర్‌, సీటీబి లేయర్ల ఏర్పాటు వంటివి ఉన్నాయి.

ఎంఈఐఎల్‌ మొత్తం 1,268 అత్యాధునిక యంత్రాలతో పాటు వివిధ పరికరాలను జోజిలా ప్రాజెక్టు పనుల కోసం వినియోగిస్తున్నది. దాదాపు 2,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తుండగా, అనేక మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కల్పిస్తున్నది.

Leave a Reply