కాపుల పట్ల సీఎం జగన్ చిన్నచూపు

 -హరి రామ జోగయ్య
అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మజీ మంత్రి హరి రామ జోగయ్య లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపు కులాలకు ప్రత్యేకించారని, దీన్ని పక్కనపెట్టే విధంగా మరో జీవోను వైసీపీ సర్కార్ ఇవ్వడం విచారకరమన్నారు. కాపుల పట్ల చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని కోరారు. అలాగే కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ కొత్త జీవోను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ డబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకి మద్దతుగా నిలిచారన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదని అంటున్నారని, అయితే ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాను వినియోగించుకునే హక్కును రాష్ట్రాలకే కేంద్రం ఇచ్చిందన్నారు. దీంతో కాపు రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నామని హరిరామ జోగయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply