Suryaa.co.in

Andhra Pradesh

గుక్కెడు నీళ్లకోసం జనంపడే కష్టాలు చూశావా బెంజి మంత్రీ?

– యువగళం పాదయాత్ర నుంచి యువనేత నారా లోకేష్

ఇది ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం కారుమంచి గ్రామం. ఊళ్లో ఉన్న ఏకైక బోరు వద్ద నీళ్లు పట్టుకొని తోపుడుబళ్లపై తోలుకుంటూ గొంతు తడుపుకుంటున్నారు. ప్రజల బాగోగులు చూడాల్సిన స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు భూకబ్జాలు, సెటిల్మెంట్లతో మునిగితేలుతూ జనం కష్టాలు గాలికొదిలేసి నాలుగేళ్లుగా ముఖం చాటేశారు. నీ నియోజకవర్గంలో గుక్కెడు నీళ్లందక ప్రజలు పడుతున్న ఈ అవస్థలు చూశావా బెంజి మంత్రి గారూ?!

మేనమామలా చూసుకోవడమంటే ఇదేనా?
ఇది ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం కారుమంచి అంగన్ వాడీ కేంద్రం. మురికికూపం నడుప ఉన్న ఈ అంగన్ వాడీ కేంద్రం వద్ద బిక్కుబక్కుమంటూ చూస్తున్న ఈ చిన్నారులను చూశావా ముఖ్యమంత్రీ?ఇక్కడకు వస్తే పౌష్టికాహారం మాట దేవుడెరుగు, రోగాలపాలు కావడం మాత్రం ఖాయం. చిన్నారులను మేనమామలా చూసుకోవడమంటే మురికికూపంలోని నెట్టి లేని రోగాలను అంటించడమా జగన్ రెడ్డీ?

LEAVE A RESPONSE