Suryaa.co.in

Andhra Pradesh

చింతామణి నాటకం నాటకం అసలు ప్రతిని అందించాలన్న హైకోర్టు

– తెలుగు వారిని దశాబ్దాల పాటు అలరించిన చింతామణి నాటకం
– నాటకాన్ని నిషేధించాలని ఎవరూ కోరలేదన్న రఘురామ తరపు న్యాయవాది
– ఒక సామాజికవర్గాన్ని తృప్తి పరిచేందుకే నిషేధించారని వాదన

అమరావతి : ఎన్నో దశాబ్దాలుగా తెలుగు వారిని అలరించిన చింతామణి నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.నాటకాన్ని ప్రభుత్వం నిషేధించడాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది.

రఘురాజు తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలను వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించాలని రాష్ట్రంలో ఎవరూ కోరలేదని… ఒక సామాజికవర్గాన్ని కించపరిచే పదాలను మాత్రమే తొలగించాలని కోరారని కోర్టుకు తెలిపారు.

అయితే ఆ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకే నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు.వాదనలు విన్న న్యాయస్థానం నాటకం అసలు ప్రతిని అందించాలని కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

LEAVE A RESPONSE