– డాక్టర్ గా నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హుడు
– ఫ్యామిలీ డాక్టర్ విధానం మళ్లీ రావాలి
– రాబోయే రోజుల్లో డేటానే పెద్ద ఎస్సెట్
– పద్మవిభూషణ్ అవార్డు గ్రహిత నాగేశ్వర రెడ్డి సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్ గా నాగేశ్వర్ రెడ్డి గారికి అరుదైన అవకాశం దక్కింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను దక్కించుకున్నారు.ఆయన భారతరత్నకు కూడా అర్హుడు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో హెల్త్ టూరిజం పాలసీని తీసుకురాబోతోంది.
రాష్ట్ర ప్రజలకే కాదు. ఇతర దేశాలకు తెలంగాణలో సేవలందించేలా రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చాలన్నదే మా ప్రయత్నం. దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు వైఎస్ శ్రీకారం చుట్టారు. మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందిస్తోంది. గతంలో ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఆ సంబంధాలు కనుమరుగయ్యాయి. ఒక కుటుంబ సభ్యుడిలా మనలో ధైర్యాన్ని నింపి చికిత్స అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానం మళ్లీ రావాలి.
రాష్ట్ర ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ తో కూడిన కార్డులను అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తులు ఎస్సెట్ కాదు. రాబోయే రోజుల్లో డేటానే పెద్ద ఎస్సెట్. వెయ్యి ఎకరాల్లో ఎయిర్ పోర్టుకు దగ్గరలో హెల్త్ క్యాంపస్ ను క్రియేట్ చేసే ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చేందుకు నాగేశ్వర్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరం. ఆయనకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.