గురకతో గుండెకు ప్రమాదం

పక్షవాత రోగుల్లో 50 శాతం గురక రోగం ఉన్నవారే
పిల్లల్లో సైతం ఈ వ్యాధి
నిద్రలేమి కారణంగానే సమాజంలో మానసిక-శారీరక రుగ్మతలు
“Sleep is Essential for Health”
“చక్కటి ఆరోగ్యం కొరకు – నిద్ర మొదటి మెట్టు.”

ఈ ప్రకృతి ఏర్పడిన రోజు నుండి, మానవునికి తెలియకుండానే, సూర్య – చంద్రుల ప్రభావముతో శరీరంలో ఉన్న, వివిధ రకములైన హార్మోన్స్, ఎంజైమ్స్ కెమికల్స్, వివిధ అవయవాల ద్వారా విడుదలవుతున్నాయి.
నిద్ర పోయిన అనంతరం విడుదలయ్యే అట్టి రసాయన పదార్థాలు, ఉదయం మానవుడు నిద్రలేచిన అనంతరం, అతని ఆలోచన, అతని మేధాశక్తి,, అతని సామాజిక లేదా వ్యక్తిగత వ్యవహారాలపై సంపూర్ణమైన ప్రభావములు చూపుతున్నది. ప్రకృతి నియమానుసారం, ఉదయం చురుకుగా చకచకా పనులు చేసుకోవడం, తన ఆలోచనలతో పదిమందికి ఉపయోగపడే తో ఆరోగ్యమైన జీవితం గడపడం, సాయంకాలం అయినప్పటికీ, సూర్యాస్తమయ సమయాన పనులు ముగించుకొని చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా నిద్రపోవడం వంటి కారణాల వల్ల మానవునికి ఎన్నో సంవత్సరాలుగా రోగాలు దూరంగా ఉండేవి.

మెలాటోనిన్ హార్మోన్:
మానవుని శరీరంలో, రాత్రిపూట విడుదల అయ్యే అతి కీలకమైన హార్మోన్ మెలాటోనిన్. దీని ప్రభావం వలనే, మానవ శరీరము లో, చక్కటి నిద్ర, సాధారణమైన షుగర్ లెవెల్స్, సాధారణంగా ఉండే బిపి, సాధారణమైన రిప్రొడక్టివ్ హార్మోన్స్, ఇంకా ఎన్నో కీలకమైన శారీరకమైన అవయవాలు వాటి పని తీరును క్రమబద్ధీకరణ లో కొనసాగిస్తున్నాయి. మెలటోనిన్ హార్మోన్ సరియైన స్థాయిలో ఉండడం వలన, ఉదయముననే కార్టిసోల్ హార్మోన్ మానవ శరీరంలో విడుదల అవుతోంది. విపరీతమైన ఒత్తిళ్ల కారణంగా, విపరీతమైన పని అలసట కారణంగా, మానవుడు సరిగ్గా నిద్రపో లేని పరిస్థితులు చూస్తున్నాము. దీని ప్రభావము వలన రాత్రిపూట, మెదడులో ఉన్న పీనియల్ గ్లాండ్ ( third eye) నుండి విడుదలయ్యే మెలటోనిన్ సరిగ్గా విడుదల కాకపోవడం వలన, వందల సంఖ్యలో మానవ శరీరాన్ని కాపాడే హార్మోన్స్, కెమికల్స్, ఎన్నజైమ, దిశ తప్పి, వాటి రక్తపు శాతం క్షీణించి, వివిధ రకాలైన రుగ్మతలూ తలెత్తుతున్నాయి.

మెలటోనిన్ ఏం చేస్తుంది?
మెదడు నుంచి వచ్చే ఆలోచన, గుండె పనితీరునీ నియంత్రించే ప్రక్రియ, వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే ప్రక్రియ, రిప్రొడక్టివ్ హార్మోన్స్ విడుదల, ఆలోచన వైఖరి, సమాజములో ఆరోగ్యమైన ఆలోచన -పద్ధతులు. వైరస్లా నుండి శరీరాన్ని కాపాడే ప్రక్రియ, అవయవములు రోగము వలన దెబ్బతిన్న పరిస్థితిలో పునరుద్ధరణ చేసే ప్రక్రియ, క్యాన్సర్ రిస్క్ వానలను వచ్చే కణాల మార్పులను దూరం పెట్టే ప్రక్రియ, మానవుని చిరాకు తగ్గించడానికి, మానవుని కోపాన్ని తగ్గించడానికి, తీవ్ర అలసట నుండి కాపాడటానికి, తదితర ఎన్నో ఉపయోగాలు మెలనిన్ వలన ఉన్నాయి.

రాత్రిపూట శరీరము లో జరిగే సిర్రకాడియన్ రిధం ?
మనం ఉదయాన్నే ఇబ్బంది లేకుండా నిద్ర లేవటానికి, పనుల్లో చురుకుదనం చూపించటానికి, ఆలోచన మేధోశక్తి సరిగ్గా పని చేయటానికి, ఉపయోగపడే హార్మోన్ కార్టిసాల్. మనం రాత్రి నిద్ర పోవటానికి, అన్ని అవయవాల వ్యవస్థీకరణ చెయ్యటానికి, మానవునికి ఉపయోగపడే అన్ని రకములైన హార్మోన్స్ కెమికల్స్ క్రమబద్దీకరణ ఉంచడానికి మెలటోనిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇట్టి కార్టిసాల్ మెలటోనిన్ సైకిల్ ని మానవ శరీరంలో రాత్రిపూట నడిపించేది సిర్రకాడియన్ రిధం.
ఎవరిలో అయితే సిర్రకాడియన్ రిధం cycle దెబ్బ తింటుందో, వారి శరీరములో సుమారు 90రోజులపల బీపీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, తీవ్రమైన ఒత్తిళ్లు, మానసిక అలజడి, గురక వ్యాధి, గుండెకు సంబంధించిన జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన మార్పులు, డిప్రెషన్, మానసిక రుగ్మత, ద్వేష భావం, వంటి అనేక వ్యాధుల మార్పులు తలెత్తే అవకాశం ఉంటుంది.

సిర్రకాడియన్ రిధం- మెలటోనిన్/ కార్టిసాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు:

a)గురక వ్యాధి:
గురక పెట్టి నిద్ర పోవడం అంటే సాధారణంగా బాగా నిద్ర పోతున్నాడు అని మనం అనుకుంటాం. ఈమాటలో సత్యము చాలా తక్కువ. రాత్రి పడుకున్నప్పుడు గురక పెట్టే వారిలో, చాలామందికి గొంతు భాగమున, కొండనాలిక వలన/ పెద్ద నాలిక వలన, శ్వాసప్రక్రియలో తీవ్రమైన ఆటంకము కలగడం వలన , ఊపిరితిత్తుల వరకూ పోవలసిన ఆక్సిజన్ చేరలేక పోతుంది. తద్వారా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ లేని రక్తమును, గుండెకు ప్రవహించి, తద్వారా వివిధ అవయవాలకు ఆక్సిజన్ లేని రక్తము ప్రవహిస్తుంది. మానవ మెదడుకి కావలసింది 100% అచ్చమైన ఆక్సిజన్. కానీ గొంతులోని ఆటంకము వలన గుండెల్లో చేరే రక్తం లో ఆక్సిజన్ లేని కారణంగా, మెదడు వరకు వచ్చే రక్తములో కూడా ఆక్సిజన్ లోపిస్తుంది. తద్వారా మెదడు( hypoxia) హైపోగ్లైయా వలన తీవ్రమైన అలజడికి లోనై, ఉక్కిరిబిక్కిరై మెదడు పై తీవ్రమైన ప్రభావము,రానున్న రోజుల్లో గుండె జబ్బులు తలెత్తే అవకాశం ఉంటుంది. రాత్రిపూట గురక పెట్టే వారిలో, 12am to 6am చనిపోయిన వారిలో,62.7% వారు కార్డియాక్ డెత్ సిండ్రోమ్ వలనే మరణిస్తున్నారు అని పరిశోధనలో వెల్లడి చేయడం జరిగింది. సెరిబ్రల్ స్ట్రోక్ – పక్షవాతం వచ్చిన వారిలో 50 శాతం వరకు గురక రోగము ఉన్నారని వెల్లడిస్తున్నారు. పిల్లల్లో సైతం ఈ వ్యాధి తీవ్రంగా ఉందని, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడిస్తున్నారు.
లక్షణాలు: ఉదయాన్నే లేవగానే విపరీతమైన చికాకు, ఉదయం అధికముగా నిద్ర రావడం, తీవ్రమైన అలసట, నోరు ఎండిపోవడం, కాళ్ల పిక్కల నొప్పి, మతిమరపు కోపము పెరగడం వీరి లక్షణాలు.
రాత్రి పూట జరిగే పరీక్ష- పాలిసోమనోగ్రఫీ – స్లీప్ స్టడీ పరీక్ష ద్వారా ఈ రోగమును గుర్తుపట్టవచ్చు.

b) నైట్ డ్యూటీ చేసే ఉద్యోగాలు
కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చాలామంది, నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. వారిలో తరచుగా విపరీతమైన మానసిక ఒత్తిడి, క్షీణించిన వ్యాధి నిరోధక శక్తి, తరచుగా చిరాకు పడడం, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం, ఆడవారిలో reproductive system సంబంధించిన వ్యాధులు పెరగడం, సంతాన లేమి మార్పులు జరగడం, జీర్ణ ప్రక్రియ దెబ్బతినడం, ప్రవర్తన వైఖరిలో మార్పు, ఉదయాన విపరీతమైన నిద్ర రావడం, ఊబకాయం రావడం, సిర్రకాడియన్ రిధం డిస్టబెన్స్ వీరిలో ముఖ్యమైన కారణం. నైట్ డ్యూటీ చేసే ఉద్యోగస్తులో తరచుగా తలెత్తే రోగము పేరు – షిఫ్ట్ వర్క్ స్లీప్ డిజార్డర్ (SWSD)

3) ఊపిరితిత్తుల్లో మరియు గొంతులో జరిగే కొన్ని మార్పుల వలన రాత్రిపూట సరిగా నిద్ర పట్టక పోవడం, నిద్రలేమి కారణాలవలన,సిర్రకాడియన్ రిధం దెబ్బతింటుంది. ఇట్టి వారిలో విపరీతమైన అలసట, చిరాకు, ఉదయము నిద్రపోవడం, తదితర లక్షణాలు ఉంటాయి.

పరిష్కార మార్గం:
పెద్దలు అయినా పిల్లలైనా త్వరగా మార్పులను గమనించి, స్లీప్ స్పెషలిస్ట్ వైద్యుల దగ్గర సంప్రదించినట్లయితే, స్లీప్ స్టడీ చేసిన అనంతరం, వ్యాధి తీవ్రతను బట్టి తగిన చికిత్స అందించడం జరుగుతుంది.

 

-డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్
పల్మనాలజిస్ట్,అలర్జీ సూపర్ స్పెషలిస్ట్,స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్.
నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ : 1800-425-0095.