Suryaa.co.in

Andhra Pradesh

భారీ వర్షాలు-సహాయక చర్యలపై మంత్రి ఫరూక్ ఆరా

– నంద్యాల మద్దిలేరు వాగు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నంద్యాలలో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

వర్ష ప్రభావం వలన చాలా ప్రాంతాలు వరద ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, అటువంటి బాధితుల వద్దకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఫరూక్ అధికారులను ఆదేశించారు. అనంతరం నంద్యాల ఒకటో వార్డు నందుగల మద్దిలేరు వాగును అధికారులతో కలిసి పర్యవేక్షించారు .

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల లో ఉన్న కాలువలకు నీరు ఎక్కువగా వస్తుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీలైతే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మంత్రి ఫరూక్ తెలియజేశారు . అలాగే మున్సిపల్ అధికారులు తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని వరద ముప్పుకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని తెలియజేశారు.

ప్రజలు వరద ముప్పును ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు ఏదైనా అవసరమైతే సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించి తగు చర్యలు పొందాలని ప్రజలను కోరారు
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , కౌన్సిలర్ నాగార్జున , మిద్దె ఉసేని , మునగాల విశ్వనాథరెడ్డి , బింగుమల్లె శ్యాంసుందర్ , ఇసుక చాంద్ , బుగ్గ రాముడు , బాలు , కాజా , గుల్లి , కొమ్ము హరి , సుధాకర్ , బుజ్జి , ఫరూక్ , ఉసేని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE