Suryaa.co.in

Andhra Pradesh

ఏపీకి ముందస్తు ఎన్నికలు లేనట్లే?

– ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

ఏపీకి ముందస్తు ఎన్నికలు లేనట్లే? అని స్పష్టమవుతోంది. ఈ మేరకు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగుస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది.. ఏపీతో పాటు 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం,ఒడిస్సా రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేసిన అధికారులను వెంటనే బదిలీచేయాలని ఈసీ పేర్కొంది.సొంత జిల్లాల అధికారులను కూడా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. పోలీసు అధికారులతో సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని సీఈసీ పేర్కొంది.

LEAVE A RESPONSE