ఎమ్మెల్యేల కుంభకోణాలను బట్టబయలు చేస్తున్నాం

– అక్రమాలను వెలికి తీసేందుకే చైతన్యరథం తీసుకొచ్చాం
– జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి

జగన్ రెడ్డి తన అధికారం, సొంతంగా ఉన్న మీడియాతో తెలుగుదేశం పార్టీపై ఘోరమైన దుష్ప్రచారం చేశారు. సాక్షికి, బులుగు మీడియా చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి మనకంటూ ఒక మీడియా అవసరమని భావించి చైతన్య రథం అనే డిజిటల్ పత్రికను ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 50 లక్షల మందికి వాట్సప్ ద్వారా షేర్ చేస్తున్నాం. ప్రభుత్వ అవినీతి, మంత్రులు, ఎమ్మెల్యేల కుంభకోణాలను బట్టబయలు చేస్తున్నాం.

నియోజకవర్గాల్లో జరిగే కుంభకోణాలు, పార్టీ కార్యక్రమాలను కేంద్ర కార్యాలయానికి చేరవేస్తే.. తప్పకుండా ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్తాం. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉండే వాట్సప్ గ్రూపుల్లోకి చేరేలా చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇంఛార్జిలదే. తప్పుడు వార్తల్ని ప్రచురించే జగన్ రెడ్డి సాక్షి పత్రికను ప్రజల డబ్బుతో కొనిపించి వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నాడు. మనం కూడా అదే స్థాయిలో మన పత్రికను గ్రామస్థాయికి తీసుకెళ్లాలి.

రాయలసీమను నాశనం చేసిన జగన్ రెడ్డి.. చంద్రబాబుపై విమర్శలు చేయడం చూశాం. రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు హంద్రీనీవాకు రూ.4182 కోట్లు ఖర్చు చేస్తే.. అతను రాయలసీమ ద్రోహా.. కావాల్సినంత బడ్జెట్ ఉండి కూడా.. మూడున్నర సంవత్సరాల్లో రూ.504 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన జగన్ రెడ్డి రాయలసీమ ఉద్దారకుడంట. కృష్ణా జలాల్లో మిగులు జలాలు అవసరం లేదని కృష్ణా ట్రిబ్యునల్ కు రాజశేఖర్ రెడ్డి లేఖ రాశాడు.

జగన్ రెడ్డి తన కేసుల కోసం కృష్ణా, గోదావరి జలాలు మొత్తం కేంద్రానికి దారాదత్తం చేశాడు. బచావత్ కమిషన్ ఇచ్చిన హక్కుల్ని నాశనం చేశాడు. ఇంతకు మించిన రాయలసీమ ద్రోహం ఇంకోటి ఉంటుందా? రాయలసీమలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. రాయలసీమ దత్తపుత్రుడు ఎన్టీఆర్, బంగారుపుత్రుడు చంద్రబాబు నాయుడు.

జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టుల్ని, మైనింగ్ ప్రాజెక్టుల్ని మింగేసిన జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఉద్దారకులుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇంత దారుణమైన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, వారి అక్రమాలను వెలికి తీసేందుకే.. మనం చైతన్యరథం తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రాంతీయ చిచ్చుతో రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. దీన్ని తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలి.

Leave a Reply