– వెయ్యి మందితో మహా దీక్ష
నేను చేస్తున్న దీక్ష యొక్క ఉద్దేశం..
రెంటికీ చెడిన రేవడిలా ఐన అగ్రవర్ణపేదల సంక్షేమం, అభివృద్ధికి రాజ్యాంగబద్దత కల్పించి, అమలుకొరకు ప్రభుత్వాలు బాధ్యతగా ఉండేందుకు, కొన్ని చట్టబద్ద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
దీనికోసం…
1). అగ్రవర్ణ పేదల సంక్షేమం,అభివృద్ధి కొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానాన్ని ప్రకటించి, ఆమోదించి, చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
2). అగ్రవర్ణ పేదల అభివృద్ధికి సంబంధించిన విశాల విధానాల రూపకల్పన, అమలులో సలహాలు, సూచనలకై జాతీయ,రాష్ట్ర స్థాయిలో తగు అధికారాలతో అగ్రవర్ణ పేదల కమిషన్ లు ఏర్పరచాలి.
3). అగ్రవర్ణ పేదల ఆర్థిక, విద్యా, సాంఘిక , జీవనప్రమాణాల అభివృద్ధికోసం ప్రత్యేక ఉప- ప్రణాళిక (Sub -Plan) చట్టబద్దంగా రూపొందించాలి. బడ్జెట్ లో కనీసం పదిశాతం నిధులు ఈ సబ్ ప్లాన్ కి కేటాయించాలి.
4). ఉద్దేశ్యపూరకంగా, అకారణంగా అగ్రవర్ణ పేదలను నిందించడం, హింసించడం, దోపిడి, అత్యాచారం, హత్యలను నిరోధించడానికి అగ్రవర్ణపేదల (అత్యాచారాల నిరోధక )చట్టం.రూపొందించి, అమలుపరచాలి.
5). వీరిపై జరిగే అత్యాచారాలు, ఆస్తుల ఆక్రమణ, ధ్వంసం,మానవ అక్రమ రవాణా, వ్యక్తిగత ఆస్తులమీద దాడులను నిరోధించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటుచేయాలి. బాదితులకు సత్వర న్యాయం, పరిహారం, పునరావాసం కల్గించేలా చట్టం రూపొందించి,అమలు పరచాలి.
6). అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను ఎదుర్కోవడంలో న్యాయ సహాయకులను కల్పించాలి.
7). ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కొరకు, తగు రోస్టర్ పాయింట్లు నిర్ధారించి, తగు నిష్పత్తిలో ప్రాతినిథ్యం కలిగేలా చూడాలి.
8). అగ్రవర్ణ పేదల మతాచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు రక్షణ, గౌరవం కల్పించాలి.
9)..అగ్రవర్ణ పేదల సంక్షేమం, అభివృద్ధి కై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖను, మంత్రిని నియమించాలి.
10). అగ్రవర్ణ పేదల విద్యాభివృద్ధికి ప్రత్యేక గురుకులాలు ఏర్పరచాలి. స్కాలర్ షిప్లు, బుక్స్, కెరీర్ గైడెన్స్, వడ్డీలేని సాంకేతిక, విదేశీ.విద్యా రుణాలు, నగదు ప్రోత్సాహాలు కల్పించాలి.
11). అగ్రవర్ణ పేదల ఆదాయాభివృద్ధి, ఆర్థిక స్వావలంబనకు ఆర్థిక, సహాకారసంస్థలు ఏర్పరిచి తగిన నిధులు కేటాయించి, ప్రభుత్వం గ్యారెంటీగా నిలవాలి. ప్రభుత్వ , ఉద్యోగ, ఉపాధి పతకాలలో తగు నిష్పత్తిలో లబ్ధిదారులను ఎన్నికచేయాలి.
12). అగ్రవర్ణ పేదల ఆరోగ్య రక్షణకు, ఆపరేషన్స్, ట్రీట్మెంట్ లకు తగిన నిధులు కేటాయించాలి.
13). అగ్రవర్ణ పేదల అభివృద్ధికి సమీకృత అభివృద్ధి పథకాలు.రూపొందించి, నిజాయితీగా అమలు పరచాలి.
14). ఆధునిక వ్యవసాయ పద్దతులు, మార్కెట్ సౌకర్యాల కల్పన, ఉపాధి కల్పన.పథకాలలో తగు నిష్పత్తిలో నిధులు కేటాయించాలి
15). కాలానుగుణంగా మారే అవసరాలు, ఛాలెంజ్ లకు అనుగుణంగా సలహాలు, సూచనలకు నిష్ణాతుల కమిటీలు, కమిషన్లు ఏర్పరచాలి.
ఇది నా డిమాండ్ . ప్రజలారా ఆలోచన చేయండి నా నిర్ణయం కరెక్టే అయితే, మీ సలహాలు సూచనలు తెలపండి. నా ఫోన్ నెంబర్ 9666606695
– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)