- గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ మార్ఫింగ్ కాదని ఎక్లిప్స్ ఫోరెనిక్స్ ల్యాబ్ నివేదిక
- జాతీయజెండా ఎగురవేసే అర్హత జగన్ రెడ్డికి లేదు!
- భరతజాతి అమృతోత్సవం జరుపుకుంటున్న వేళ ఎపిలో మహిళలపై అఘాయిత్యాలు
- గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకుంటే టీడీపీ తరపున డిల్లీ స్ధాయిలో పోరాటం
- మానవమృగాలు, జంతువులకు కులాలు ఉండవు మాధవ్!
- టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మార్పింగ్ చేసింది కాదని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెనిక్స్ ల్యాబ్ నివేదికలో వెల్లడైంది…. దీనికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ పై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం మాధవ్ న్యూడ్ వీడియోపై అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెనిక్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ. గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాధ్యతగల ప్రజా ప్రతిప్రతినిధిగా ఉన్న గోరంట్ల మాధవ్ చేసిన పాడు పనిని దేశమంతా అసహ్యించుకుంటోంది. గతంలో ఎందరో తెలుగు ఎంపీలు తమ పనితీరుతో రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెచ్చారు. కానీ నేడు గోరంట్ల మాధవ్ లా రాష్ట్ర పరువు దిగజార్చేలా, దేశంలో మహిళలు బాధపడేలా ఇంతవరకు దేశ చరిత్రలో ఏ ఎంపీ వ్యవహరించని విధంగా ప్రవర్తించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో పట్టాభి ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లయినా గోరంట్ల మాధవ్ లాంటి కామపిశాచుల వల్ల మహిళలు ఇంకా వేధింపులకు గురవుతున్నారు. మహిళా భద్రత కోసం దిశ చట్టం, యాప్ లు తీసుకొచ్చామని ప్రగల్బాలు పలుకుతున్న జగన్ రెడ్డి తన సొంత పార్టీ ఎంపీ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలంతా జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అయినా జగన్ రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించకోకుండా వ్యవస్ధలను, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని గోరంట్ల మాధవ్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వీడియోని ఫోరెనిక్స్ ల్యాబ్ కి పంపకుండా అది మార్పింగ్ వీడియో అని సాక్ష్యాత్తు అనంతపురం జిల్లా ఎస్సీతో చెప్పించారంటే ముఖ్యమంత్రిని ఏమనాలి? పోరెనిక్స్ ల్యాబ్ కి పంపకుండా వీడియో మార్ఫింగ్ అని ఎలా చెప్తారు? కామపిశాచుల్లా మహిళల్ని వేధించిన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోకపోగా మంత్రి పదవి కట్టబెట్టారు. రేప్, మర్డర్ కేసులున్న పోరంబోకు గోరంట్ల మాధవ్ కి భీపాం ఇచ్చి పార్లమెంట్ కి పంపిన వ్యక్తి జగన్ రెడ్డి. మాధవ్ బరితెగించి వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు.
మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను ఈ నెల 9న అమెరికాలోని సెయింట్ అగస్టీన్ ప్లోరిడాలోని ఎక్లిప్స్ ఫోరెనిక్స్ ల్యాబ్ కి పంపాం. ఆ వీడియోని ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన యాంపిడ్ పైవ్ వీడియో ఫోరెనిక్స్ సాప్ట్ వేర్ తో పరీక్షలు చేశామని, ఇది ఎడిటింగ్ చేసిన వీడియో కాదని ల్యాబ్ నిపుణుడు జిమ్ స్టాఫ్ వార్డ్ నివేదిక ఇచ్చారు. ( In conclusion, based on my education, training, experience, and expertise in image analysis, mobile investigation, and digital forensic examination it is my expert opinion that the Video shown in this recording is authentic and un-edited.) దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? కామపిశాచి గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవడానికి జగన్ రెడ్డికి ఈ నివేదిక సరిపోతుందా? ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? మీ ఎంపీ మహిళతో నగ్నంగా అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోకుండా ఇంకా వెనకేసుకొస్తారా? తనకు అమ్ముడుపోయిన అధికారులను అడ్డం పెట్టుకుని డ్రామాలాడుతున్న జగన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారు?
మహిళల్ని వేధించిన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కాబట్టి మాధవ్ విషయంలో కూడా అలానే వ్యవరిస్తారని మేం ఊహించే వీడియోని ఫోరెనిక్స్ ల్యాబ్ కి పంపి పరీక్ష చేయించాం. ఫోరెనిక్స్ ల్యాబ్ నివేదిక తర్వాత మాధవ్ పై చర్యలు తీసుకుంటామని మొన్న సజ్జల, మంత్రి రోజా అన్నారు. మరి ఇప్పుడు మాధవ్ పై చర్యలు తీసుకుంటారా? ఒక్క క్షణం కూడా గోరంట్ల మాధవ్ కి ఎంపీ పదవిలో కొనసాగే అర్హత లేదు. ఏదో ఘన కార్యం చేసినట్టు అనంతపురంలో హోర్టింగ్ లతో స్వాగతాలు పలికించుకోవడానికి మాధవ్ కి సిగ్గుగా లేదా? ఇప్పుడు ఫోరెనిక్స్ నివేదిక రిపోర్ట్ పెట్టి హోర్డింగులు కట్టించుకో. చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు లకు మాధవ్ సవాల్ చేయటం ఏంటి? మనిషి రూపంలో ఉన్న మానవ మృగం మాధవ్ కి సమాజంలో ఉండే అర్హత లేదు. మాధవ్ పై ఏ చర్యలు తీసుకుంటారో డీజీపీ, ముఖ్యంత్రి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి తక్షణమే అతనితో రాజీనామా చేయించి కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసులు అదుపులోకి తీసుకోవాలి.
కురుబ కులంలో దేశానికి సేవ చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు, అలాంటి కులానికి మాధవ్ కళంకం తెచ్చాడు. జంతువైనా మాధవ్ కులాల గురించి మాట్లాడం ఏంటి? మానవమృగాలకు, జంతువులకు కులాలు ఉంటాయా? గత ఎన్నికల్లో వైయస్ భారతిరెడ్డి తన భర్తను గెలిపించాలంటూ మహిళలు ఓట్లు అడిగారు. మాధవ్ లాంటి కామపిశాచులపై చర్యలు తీసుకోవాలని చెప్పాలిన బాధ్యత భారతి రెడ్డిపై కూడా ఉంది. మాధవ్ పై చర్యలు తీసుకోకుండా ఆగస్టు 15 న జాతీయ జెండా ఎగరేసే అర్హత గన్ రెడ్డికి లేదు. మాధవ్ పై చర్యలు తీసుకోకపోతే టీడీపీ తరపున రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ, పార్లమెంట్ స్పీకర్ కి ఎక్లిప్స్ ఫోరెనిక్స్ నివేదిక అందజేస్తాం. దీనిపై టీడీపీ తరపున డిల్లీ స్ధాయిలో ఉద్యమిస్తామని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.