రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా హీరో శివాజీ, బి.వి రాఘవులు

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గుడ్లూరు లోనే విరామం ప్రకటించిన నేపథ్యంలో.. వారికి మద్దతుగా సినీ నటుడు హీరో శివాజీ గుడ్లూరు వచ్చి, అమరావతి రైతన్నలను కలిసి పరామర్శించారు వారి పోరాటానికి మద్దతు తెలిపి మీడియా సమావేశంలో మాట్లాడారు.
హీరో శివాజీ మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం పూర్తి చేసి రాజధానిగ ప్రకటిస్తే , భవిష్యత్తు తరాలకు ఒక సింహాస్వప్నంగ నిలుస్తోంది అన్నారు.,ఆంద్రప్రదేశ్ ఖ్యాతి రెట్టింపు అవుతుంది అని, భూములు ఇచ్చిన రైతన్నల ఆత్మగౌరవం నిలబడుతుంది అని తెలిపారు. అమరావతే రాజధానిగా ఉంటుందని .ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాడదాం అని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు అభినందనలుతెలిపారు.
ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. రాజధాని శాశ్వతం కాదు: బి.వి రాఘవులు వెల్లడి
అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి. రాఘవులు డిమాండ్ చేశారు. అమరావతి రైతులు చేస్తోన్న పోరాటం తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రకు, బి. వి. రాఘవులు పాల్గొని సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారని తెలిపారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న పోరాటంలో రైతులు లేరని, పెయిడ్ ఆర్టిస్టులతో నిర్వహిస్తున్నారని అనడం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తగదన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, రాజధాని శాశ్వతమని తెలిపారు. అంతిమంగా రైతుల పోరాటం విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శివరాం, ఇంటూరి రాజేష్,ఇన్నమూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.