కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్

పంట బీమా చెల్లింపునకు 2019 నవంబర్‌‌‌‌ 23న ప్రభుత్వం జీవో ఇచ్చినా నిధులు విడుదల చేయలేదని దాఖలైన పిటిషన్పై ఏడాది దాటినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌‌‌‌ వేయకపోవడంతో హైకోర్టు ఫైర్ అయింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఫైనల్గా అవకాశం ఇస్తున్నామని, మరోసారి ఇచ్చేదిలేదని మంగళవారం తేల్చిచెప్పింది. లేదంటే అప్పుడు జరిగే విచారణకు అగ్రికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాకు చెందిన శంకర్‌‌‌‌ ఏడాది కింద వేసిన పిల్‌‌‌‌లో ప్రభుత్వం కౌంటర్‌‌‌‌ వేయకుండా కాలయాపన చేస్తోందని పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌ రచనారెడ్డి కోర్టుకు చెప్పారు. 2018–19 ఏడాది వానాకాల, యాసంగి పంటలకు పంటల బీమా జీవో ఇచ్చినా నిధులు ఇవ్వలేదన్నారు. నిధుల్లో రాష్ట్రం,కేంద్రం సగంసగం ఇవ్వాలని, ప్రభుత్వం కౌంటర్‌‌‌‌ కూడా వేయలేదని అన్నారు. దీనిపైహైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. చివరిసారిగా అవకాశం ఇచ్చింది.

Leave a Reply