Suryaa.co.in

Andhra Pradesh

గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యం

– సకల సౌకర్యాలు త్వరితగతిన కల్పన
– మంత్రి పార్థసారథి

నరసరావుపేట : రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సాథి అన్నారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడు అర్బన హౌసింగ్ లే అవుట్ లో శుక్రవారం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

జగనన్న కాలనీలను పీఎంఏవై-ఎన్టీఆర్‌ కాలనీలుగా పేరు మార్చినట్టు తెలిపారు. మెయిన్ రోడ్డు నుండి కాలనీ వరకు విద్యుదీకరణ పనులు త్వరితగతిన చేపడుతున్నట్టు తెలిపారు. అదే విధంగా మార్చి మాసాంతానికి మరో 1500 ఇల్లు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని తెలిపారు. రానున్న అయిదేళ్ళలో ప్రతి పెద వానికి గృహ వసతి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవానికి సొంత ఇంటి కల నిరవేర్చేలా పనులు చేపట్టాలని ముఖ్య మంత్రి సూచించారన్నారు.

2014-2019 కాలంలో గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.5 లక్షలు ఇవ్వగా వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 30 వేలు, కేంద్ర ప్రభుత్వం లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు గృహ నిర్మాణ శాఖ నుండి నిధులు మంజూరు చేయడంతోపాటు కలెక్టర్ నిధులు జోడించి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ పి.అరుణ్ బాబు, రెవెన్యూ డివిజినల్ అధికారి మాధవీ లత, గృహ నిర్మాణ శాఖ అధికారి వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE