Suryaa.co.in

Telangana

తాత కేసీఆర్ తో కలిసి హిమాన్షు పొలం పనులు

ఎర్ర‌వెల్లి లోని కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో హిమాన్షు రావు త‌న తాత కేసీఆర్ సూచ‌న‌ల‌తో తానే స్వ‌యంగా పార‌తో మ‌ట్టి తీసి, ఓ చెట్టును నాటాడు. ఆ చెట్టు చుట్టూ ఎరువును కూడా పోసి మ‌ళ్లీ పార‌తో మ‌ట్టిని క‌ప్పాడు. ఆ వీడియోను త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన హిమాన్షు.. ఓ సందేశం ఇచ్చాడు. ఉత్త‌ముల నుంచి నేర్చుకోవ‌డం అని రాసుకొచ్చాడు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని పేర్కొన్నాడు. మన సహజ వనరులను రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షు రావు మేసేజ్ ఇచ్చాడు.

LEAVE A RESPONSE