Suryaa.co.in

Telangana

ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు

– మంత్రి దామోదర రాజనర్సింహ

మహబూబ్ నగర్ : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలు పై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశం ను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు నిర్వహించారు.

మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ సందర్భంగా ఏమన్నారంటే…ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో పర్యటిస్తా. ఇందిరమ్మ కమిటీలు, జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ సభలో పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలి.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోయే నాలుగు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి.

సమన్వయ సమావేశంలో ఎం.ఎల్.సి కూచు కుళ్ళ దామోదర్ రెడ్డి, శాసన సభ్యులు జాన పల్లి అనిరుధ్ రెడ్డి(జడ్చర్ల), జి.మధు సూదన్ రెడ్డి(దేవరకద్ర), కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి( నాగర్ కర్నూల్), వాకిటి శ్రీ హరి (మక్తల్), మేఘా రెడ్డి (వన పర్తి), రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, స్పెషల్ ఆఫీసర్ జి.రవి నాయక్, జిల్లా కలెక్టర్ లు విజయేందిర బోయి(మహబూబ్ నగర్), బదావత్ సంతోష్(నాగర్ కర్నూల్), బి.ఎం.సంతోష్ (గద్వాల) ఆదర్శ్ సురభి (వన పర్తి), అదనపు కలెక్టర్ లు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE