– బిజెపి డిమాండ్
మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని మరియు చర్చి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ బిజెపి మహిళల నాయకత్వంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టేట్ మహిళా మోర్చా సెక్రెటరీ సాధినేని యామిని శర్మ మరియు ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు పాల్గొనడం జరిగినది.
సాధినేని యామిని శర్మ, జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనిసులు మాట్లాడుతూ
పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామంలో వెలసిన గోడ్రాలి కొండ తిరుమల స్వామి దేవాలయం దగ్గర అక్రమంగా ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలి గౌరవనీయులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ కు
బిజెపి ఒంగోలు పార్లమెంటు తరఫున వినతిపత్రం ఇచ్చారని తెలియజేశారు మరియు హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా కొంతమంది అన్యమతస్తులు గొడ్రాలు కొండపై అన్యమత చిహ్నాలు అక్రమంగా అనుమతిలేకుండా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.
గొడ్రాలి కొండపై శిలువను పెట్టిన అందరి పై కేసులు పెట్టాలని మరియు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మంత్రి సురేష్ వెంటనే రాజీనామా చేయాలి ఒంగోలు పార్లమెంటు జిల్లా డిమాండ్ చేస్తుంది అని అన్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోటేశ్వరి జిల్లా ప్రధాన కార్యదర్శి వైవీ గౌతమ్ అశోక్, బీజేపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు పివి శివా రెడ్డి , బొమ్మసాని పద్మావతి , జిల్లా కార్యదర్శులు రాయపాటి అజయ్ కుమార్ , తీగల సత్యవతి , ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ అల్లరి రామయ్య మైనార్టీ జనరల్ సెక్రెటరీ షేక్ కరీం బేగ్ డాక్యుమెంట్ సెల్ ఇంచార్జ్ భువనేశ్వరి ఆర్టిజన్ సెల్ కన్వీనర్ పిన్నింటి తిరుమల ఆధ్యాత్మిక సెల్ కన్వీనర్ రాంబాబు , ఫిషర్ మెన్ సెల్ కన్వీనర్ రాజేష్ వర్మ , ఒంగోలు టౌన్ 1 అధ్యక్షుడు మధు యాదవ్ ఒంగోలు టౌన్ 3 అధ్యక్షుడు గుర్రం రంగనాథ్ ఒంగోలు టౌన్ 5 అధ్యక్షుడు కంభంపాటి ఆంజనేయులు , సీనియర్ నాయకులు ఖాలీఫాతుల్లా బాషా మహిళా మోర్చా నాయకులు విజయ లక్ష్మి యువ మోర్చా నాయకులు రాజశేఖర్ మరియు తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.