ప్రభుత్వ వ్యవస్థ ద్వారానే ఇంటింటి పెన్షన్లు

– టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్

ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, లబ్దిదారులకు రేపు పెన్షన్ లు అందేలా చూడాలి.వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో… లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ ల పంపిణీ నిలిచిపోకూడదు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్ లు పంపిణీ పూర్తి చేయాలి.

Leave a Reply