-చంద్రబాబు నిర్దోషి అని సీఐడీ రిమాండ్ రిపోర్టే చెబుతోంది
– మంత్రులు, సజ్జల దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
• సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడా చంద్రబాబు తప్పుచేశాడని చెప్పే ఆధారాలు, సాక్ష్యాలు లేవు
• జగన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగమే చంద్రబాబును జైలుకు పంపడమని సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లోని అంశాలే చెబుతున్నాయి
• రిమాండ్ రిపోర్ట్ లోని పేజీ నెం-21, పేరాగ్రాఫ్ – 10లో చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగిందంటున్న అవినీతికి సంబంధించి, చంద్రబాబుకి డబ్బు అందినట్టు ఇంకా తాము నిర్ధారణకు రాలేదని, ఆ డబ్బు ఎవరికి చేరిందో కూడా తమకు తెలియదని సీఐడీ స్పష్టంగా పేర్కొంది.
• అలానే అవినీతి సొమ్ము ఇంతని కూడా చెప్పలేదు. పేజీ నెం-16లో ఒక పేరాలో రూ.145.37కోట్లని, మరో పేరాలో రూ. 279కోట్లు అని, పేజీ నెం-21 లో అసలు ఈ సొమ్మంతా ఎటుపోయిందో, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తెలియదని సీఐడీ చెప్పింది.
• డబ్బు ఎంతో తెలియకుండా, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తేలకుండా, చంద్రబాబు తప్పు చేశాడని ఎలా అంటారు?
• రిమాండ్ రిపోర్ట్ లోని పేజీ నెం-20, పేరాగ్రాఫ్ – 8, పాయింట్ నెం-2 లో ఇన్ కంటాక్స్ విభాగం చంద్రబాబుకి ఇచ్చింది అంటున్న నోటీసు కాపీ తమవద్ద లేదని డిపార్ట్ మెంట్ వారు తమకు పొందుపరచలేదని సీఐడీ పేర్కొంది
• ఐటీ నోటీసు కాపీ లేనప్పుడు, దానిలోని సమాచారంపై అవగాహన లేనప్పుడు అటువంటి నోటీసు ఆధారంగా కేసు ఎలా పెడతారో, రిమాండ్ రిపోర్ట్ లో ఎలా అసత్యాలు రాశారో సీఐడీ అధికారులు సమాధానం చెప్పాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఎటువంటి ఆధారాలు బయటపెట్టకుండా, ఎలాంటి సాక్ష్యాలు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టకుండా కేవలం ప్రజలపక్షాన నిలిచి జగన్ రెడ్డి దుర్మార్గపు, అవినీతి ప్రభుత్వంపై పోరాడుతున్నాడన్న అక్కసుతోనే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ తప్పుడు కేసుపెట్టి చంద్రబాబుని జైలుకు పంపారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
ఒక ప్రూవెన్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్, 11 సీబీఐ ఛార్జ్ షీట్లు, 6 ఈడీ ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న ఆర్థిక ఉగ్రవాది, లక్షలకోట్లు దిగమింగిన అత్యంత అవినీతిపరుడైన జగన్ రెడ్డి, ఏ తప్పు చేయని చంద్రబాబుని అరెస్ట్ చేయించడం కేవలం తన రాజకీయ వికృత క్రీడలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ జగన్ రెడ్డి దుర్మార్గాలు, అవినీతి, దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారు. నాలుగే ళ్లలో జగన్ రెడ్డి సాగించిన దోపిడీని, చేసిన విధ్వంసాన్ని చంద్రబాబు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ప్రజల్లో నానాటికీ క్షీణిస్తున్న తన పరపతిని ఎలాగైనా కాపాడుకోవాలన్న దుగ్ధతోనే జగన్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు.
సీఐడీ విభాగం కోర్టులో వేసిన 30 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడైనా ఇదిగో ఈ రకంగా అవినీతి జరిగిందని..ఈ మార్గంలో చంద్రబాబుకి డబ్బు చేరిందని ఎక్కడా లేదు. మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని, డబ్బు లావాదేవీలు ఎటునుంచి ఎటుపోయాయో తెలియదని సీఐడీనే రిపోర్ట్ లో పేర్కొంది. ఉదయం నుంచి పిచ్చిపట్టినట్టు ఏదిపడితే అది మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. మంత్రులు… వైసీపీనేతలు ముందు సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో తెలుసుకోవాలి.
రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ పేర్కొన్న కీలక విషయాలు..
రిమాండ్ రిపోర్ట్ లోని పేజీ నెం-21, పేరాగ్రాఫ్ – 10లో చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగిందంటున్న అవినీతి, వికాస్ కన్విల్కర్ తదితరులకు సంబంధించిన డబ్బు లావాదేవీలపై ఇంకా మేం నిర్దారణకు రాలేదని, నిజానిజాలు నిగ్గు తేల్చాల్సి ఉందని సీఐడీ చెప్పింది. (the end use of the monies which were apparently being drawn out has cash and parked with vikas khanvilkar etc are required to be ascertained) సీఐడీ ఇంత నేరుగా డబ్బు లావాదేవీలపై తమకు స్పష్టత లేదని, ఆ వివరాలు ఇంకా కనుగొనాల్సి ఉందని చెబుతుంటే, చంద్రబాబు అవినీతి చేశాడని పిచ్చికుక్కలు ఎలా చెబుతాయి?
సీఐడీ రిపోర్ట్ లో అవినీతి సొమ్ముపై ఒక్కోచోట ఒక్కో అంకె వేశారు. పేజీ నెం-16 లోని ఒక పేరాలో రూ.145.37కోట్ల అవినీతి అన్నారు.. కిందనే ఉన్న మరోపేరాలో రూ. 279 కోట్లు అన్నారు. పేజీ నెం-21లో అసలు ఆ సొమ్మంతా ఎటుపోయిందో, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో తెలియదంటున్నారు. డబ్బు ఎంతో తెలియకుండా, ఎవరి ఖాతా ల్లోకి వెళ్లిందో తేలనప్పుడు చంద్రబాబు తప్పు చేశాడని ఎలా అంటారు.. ఇష్టమొచ్చి నట్టు ఎలా మొరుగుతారు? దీనిద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతకు మేలు చేస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరగనటువంటి అవినీతి, జరిగిందని సృష్టిం చే ప్రయత్నం చేశారే తప్ప, ఎక్కడా పైసా కూడా ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు సీఐడీ నేటికీ నిరూపించలేకపోయింది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
మంత్రులు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సీదిరి అప్పలరాజు, రోజా, కన్నబాబు, పేర్నినాని, అంబటి, కాకాణి గోవర్థన్ రెడ్డిలు ఏం మాట్లాడారో వారికే తెలియదు. జగన్ రెడ్డి అవినీతి బురదలో పొర్లుతూ, ఆ బురదను చంద్రబాబుకి అంటించే ప్రయత్న చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఇదే వైసీపీనేతలు, జగన్ రెడ్డి, అవినీతి మీడియా చంద్రబాబు రూ.6 లక్షల కోట్లు తినేశాడని గగ్గోలు పెట్టాయి.
తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించి, ప్రజల్లోకి వదిలారు. చివరకు ఆ కాగితాలు పొట్లాలు కట్టుకోవడా నికి తప్ప దేనికి పనికి రాకుండా పోయాయి. నిజంగా చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ఉంటే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు నిజానిజాలు నిగ్గుతేల్చలేదు? తను ఆడమన్నట్టు ఆడుతున్న దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ జరిపించలేదు? వచ్చే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతున్నామని తెలిసే జగన్ రెడ్డి అతని ప్రభుత్వం చంద్రబాబు లక్ష్యంగా కుట్ర రాజకీయాలకు తెరలేపింది.
నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొంటూ, వారి భవిష్యత్ కు భరోసా ఇస్తున్న చంద్రబాబుపై ఏదో రకంగా చంద్రబాబుపై అవినీతి బురద వేసి, ఎన్నికల్లో గెలవాలన్న తంతు తప్ప స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతిలేదు. టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలు కోసం చెల్లించిన రూ.371కోట్లలో రూపాయి దుర్వినియోగం కాలేదు. ఇదే వాస్తవం. ప్రతిరూపాయిని టీడీపీ ప్రభుత్వం సక్రమంగా యువత భవితకోసం సద్వినియోగం చేసింది.
దానికి నిదర్శనం ఇప్పటికీ రాష్ట్రంలో పనిచేస్తున్న 42 స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు..వాటిలో శిక్షణ పొందిన లక్షలమంది యువతే. అవినీతి జరిగితే స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లోకి అధునాతన పరికరాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎలా వచ్చాయో జగన్ రెడ్డి, అతనికి ఊడిగం చేసే తాబేదార్లు సమాధానం చెప్పాలి.
జగన్ రెడ్డి సహా, ఉదయం నుంచి పిచ్చిపట్టిన వాళ్లలా మొరుగుతున్న వైసీపీ నేతలు ఎవరైనా సరే తమతో ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ కేంద్రానికి వస్తే స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రంలోని పరికరాలు ఏ విధంగా ఉంటాయో, యువతకు ఏరకంగా మేలు జరుగుతోందో కళ్లకు కట్టినట్టు చూపిస్తాం.
ఐటీ నోటీసుపైనా విషప్రచారం… నేటికీ సీఐడీ చేతిలో లేనటువంటి ఒక ఐటీ నోటీస్ ఆధారంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఏ విధంగా ఆరోపిస్తారు?
చంద్రబాబుకి ఐటీ నోటీసు అంటూ జగన్ రెడ్డి అవినీతి మీడియా, బ్లూమీడియా పనిగట్టుకొని మరీ విషప్రచారం చేస్తోంది. అసలు ఆ నోటీసు ఏంటో, దానిలో ఏముందో ఎవరికి తెలుసు? వారి చేతిలో లేని నోటీసుని ఆధారం చేసుకొని చంద్రబాబుపై వేసిన రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ రాసిందంతా ఒక కట్టుకథే అని రిమాండ్ రిపోర్ట్ లోని పేజీ నెం-20, పేరాగ్రాఫ్–8, పాయింట్ నెం-2 లో చంద్రబాబుకి వచ్చిందని భావిస్తున్న ఇన్ కంటాక్స్ నోటీసు సర్టిఫైడ్ కాపీ కావాలని ఛైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశామని, కానీ మాకు నేటికీ వారివద్ద నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, మా చేతికి ఇంకా సదరు నోటీస్ కాపీ అందలేదని రాశారు. (for getting the certified copies of the evidences from the incometax department, a letter was addressed to the chairman, central board of direct taxes, new delhi and the obtaining of the material is pending)
వారి చేతికి అందని, సమాచారం లేని ఐటీ నోటీసు ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ లో ఎలా పిచ్చిరాతలు రాశారో సీఐడీ అధికారులు సమాధా నం చెప్పాలి. ఐటీ నోటీసు అని పదిరోజుల నుంచి తెగ హాడావుడి చేస్తున్న బులుగు మీడియా, వైసీపీ నాయకులు తమ ఇష్టానుసారం ఎలా దుష్ప్రచారం చేస్తారు? దీనిని బట్టి వైసీపీ నేతలు, బులుగుమీడియా యొక్క అనైతిక వ్యవహారాలు మరోసారి బయటపడ్డాయి. కోర్టులో సీఐడీ వేసిన రిమాండ్ రిపోర్ట్ లో తమవద్ద లేని ఇన్ కంటాక్స్ నోటీసుని ఉటంకిస్తూ చంద్రబాబు అవినీతి చేశాడని ఎలా చెబుతున్నారో సీఐడీ అధికారులు చెప్పాలి.
ఇన్ కంటాక్స్ నోటీసు ఉండదు.. అవినీతి జరిగింది అంటున్న డబ్బు ఎటుపోయింతో తెలియదు…కానీ చంద్రబాబు తప్పుచేశాడు… ప్రజలసొమ్ము కొట్టేశాడని మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వైసీపీ నేతల్లా నోటికొచ్చింది మేం మాట్లాడం. ఆధారాలు, రుజువులతోనే వారి దుష్ప్రచారాన్ని ఎండగడతాం. అసలు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్లుగా మారిన వైసీపీఎంపీ మాగుట, విజయసాయి బంధువైన శరత్ చంద్రారెడ్డిపై చర్యలు తీసుకోలేని జగన్ రెడ్డి… నేడు మాకు అవినీతిపై పాఠాలు బోధిస్తాడా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అప్రూవర్ గా మారాడా..లేదా? తాను అవినీతికి పాల్పడ్డానని, కోట్లు మింగానని ఒప్పుకున్న సొంత పార్టీ ఎంపీని వదిలేసి ఏ తప్పూ చేయని చంద్రబాబుపై నిందలేస్తారా? న్యాయస్థానంలో తాను తప్పుచేశానని ఒప్పుకున్న వైసీపీ ఎంపీపై జగన్ రెడ్డి ఏంచర్యలు తీసుకున్నాడు?
ఏ2 విజయసాయిరెడ్డి సమీపబంధువు, అరబిందో సంస్థ నిర్వాహకుడు శరత్ చంద్రారెడ్డి కూడా లిక్కర్ స్కామ్ లో తాను అప్రూవర్ గా మారానని, ఈ స్కామ్ లో కీలక పాత్ర తనదేనని కోర్టుబోనులో నిలబడి మరీ చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే తాను ఆర్థిక నేరానికి పాల్పడ్డానని ఒప్పుకున్నట్టే కదా జగన్ రెడ్డి,.. మరి అతనిపై ఏంచర్యలు తీసుకున్నావు?
పైగా సిగ్గులేకుండా అలాంటి అవినీతిపరుడిని పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంబోర్డులో సభ్యుడిగా నియమిస్తావా? కోర్టుబో నులో నిలబడి తాము తప్పు చేశాం..అవినీతికి పాల్పడ్దామని ఒప్పుకున్న సొంతపార్టీ ఎంపీలను వదిలేసి, బుద్ధి లేకుండా చంద్రబాబుపై విషప్రచారం చేస్తారా? శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస రెడ్డిల వ్యవహారంపై మతిలేని మంత్రులు నోరు విప్పరేం?
2004లో కేవలం రూ.9 లక్షల ఆదాయమున్న జగన్ రెడ్డి నేడు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు?
ప్రజలిచ్చిన అధికారంతో నాలుగేళ్లలో ప్రజల్ని రోడ్డునపడేసి, రాష్ట్రాన్ని లూఠీచేసి నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఎంత దోచేశాడో, ఎన్నివేలకోట్లు దిగమింగాడో ప్రజలకు అంతా తెలుసు. ఏం వ్యాపారం చేసి సంపాదిస్తే జగన్ రెడ్డి దేశంలో అత్యంత ధనిక ముఖ్య మంత్రి అయ్యాడు? 2009 ఎన్నికల అఫిడవిట్లో రూ.77కోట్ల ఆదాయమున్నట్టు చె ప్పాడు. 2011నాటికి అది రూ.345కోట్లుగ చూపాడు. ఇప్పుడు అసలు ఎంత సొమ్ము ఉందో తనకే లెక్క తెలియదు.
ఈ విధంగా లక్షలకోట్లు కొట్టేసి, కేసులవిచారణకు హాజరు కాకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటూ, ఆఖరికి దేశం దాటివెళ్లాలం టే కోర్టుల అనుమతి తీసుకునే దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్న జగన్ రెడ్డి ఉంటే, సిగ్గు శరం లేకుండా వైసీపీనేతలు, మంత్రులు చంద్రబాబుని అవినీతిపరుడు అంటారా? 2019లో ముఖ్యమంత్రి అవ్వగానే చంద్రబాబు అవినీతిని నిరూపిస్తే అధికారులకు సన్మానం చేస్తానన్న జగన్ రెడ్డి, ముందు నీ అవినీతి సంగతి చెప్పు. నాలుగేళ్లలో ఒక్క రికైనా సన్మానం చేశావా?
జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు తప్పు చేశాడని నిరూపించలేడు. చంద్రబాబు నిప్పు.. జగన్ రెడ్డిలా ప్రజలసొమ్ము కొట్టే సే దగుల్భాజీ కాదు. ఊరికే చేతిలో సొంత మీడియా ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడ టం కాదు… మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లోని అంశాలపై సమాధానం చెప్పాలి. ఐటీ నోటీసులపై…. చంద్రబాబు కాజేశాడంటున్న సొమ్ముపై మంత్రులు నోరు విప్పాలి.
జైల్లోపెడితే చంద్రబాబు వెనకడుగు వేస్తాడనుకోవడం వైసీపీ మూర్ఖత్వం.. సింహం ఒకడుగు వెనక్కువేసిందంటే భయపడినట్టుకాదు జగన్ రెడ్డి
కుట్రపన్ని, డబ్బు.. అధికారంతో వ్యవస్థల్ని గుప్పిటపట్టి చంద్రబాబుని జైలుకు పంపి నంత మాత్రాన ఆయన తప్పుడు మనిషి అయిపోడు. ఆయన్ని కడిగిన ముత్యంలా బ యటకు తీసుకొచ్చేవరకు పోరాడతాం. జగన్ రెడ్డి దుర్మార్గాలు తెలిసే నేడు ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారు. ప్రజల్ని పోలీసులసాయం తో ఎంతకాలం నిరోధిస్తారు? 5కోట్లమందిని కొట్టడానికి సరిపడినన్ని లాఠీలు పోలీసుల వద్ద ఉన్నాయా?
జగన్ రెడ్డీ.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీతో సహా, నీ కేబినెట్ లోని మంత్రులందరి భరతాం పడతాం. ఇప్పుడు జగన్ రెడ్డిపై ఉన్న 11 సీబీఐ ఛార్జ్ షీట్లు రేపు 110 అవుతాయి. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ప్రజలు ఆందోళన చెందాల్సి న పనిలేదు. కొద్దిరోజులు జైల్లో పెడితే చంద్రబాబు వెనకడుగు వేస్తారనుకోవడం మీ మూర్ఖత్వమే. సింహం ఒకడుగు వెనక్కు వేస్తే, భయపడినట్టు కాదని తెలుసుకోండి. లంఘించి దూకేముందే మృగరాజ ఒకడుగు వెనక్కువేస్తుంది. అది దూకాక చుట్టూ ఎవరూ కనిపించరు.
రేపు చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి దూకితే మీరంతా తడుపుకోవా ల్సిందేనని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబుని విచారిస్తున్న సమయంలో సాక్షి కెమెరా మెన్, సీఐడీ కార్యాలయంలోకి ఎలా వెళ్లాడు? మిగతా మీడియా సంస్థల్ని వదిలేసి సాక్షి సిబ్బందిని మాత్రమే ఎందుకు అనుమతించారు? ఎందుకంటే లండన్లో కూర్చొని జగన్ రెడ్డి లైవ్ చూస్తూ రాక్షసానందం పొందడానికి. మీడియా ముందుకొచ్చి మిడిమి డి జ్ఞానంతో చంద్రబాబుపై నిందలేయడం కాదు… దమ్మ, ధైర్యముంటే వైసీపీనేతలు, మంత్రులు తాము లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలి.
నిత్యం ప్రజల మధ్య ఉండి, జగన్ రెడ్డి అవినీతిని బయటపెడుతున్నాడన్న అక్కసు, భయంతోనే చంద్రబా బుని అక్రమంగా అరెస్ట్ చేయించారు.” అని పట్టాభిరామ్ స్పష్టంచేస్తూ, సీఐడీ రిమాండ్ రిపోర్ట్ పై తాను లేవనెత్తిన అంశాలపై తక్షణమే జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.