Suryaa.co.in

Telangana

కెకెకు ఆ భూమిని తక్కువకే ఎలా ఇస్తారు?

– హైకోర్టులో పిటిషన్
– ప్రతివాదులుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవిత

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపి కె.కేశవరావు చిక్కుల్లో పడ్డారుబంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో భూమిని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు తక్కువ ధరకు కట్టబెట్టారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ భూమిని జీవో నంబర్ 56 ద్వారా కె.కె. కుటుంబానికి క్రమబద్ధీకరించారని, రఘువీర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రెవెన్యూ అధికారులు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవితలను చేర్చారు.

ఈ భూమిని తక్కువ ధరకు కేటాయించారని, ఈ స్థల కేటాయింపునకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

LEAVE A RESPONSE