Home » కులం ఎలా వచ్చిందంటే…

కులం ఎలా వచ్చిందంటే…

ప్రతిరోజూ కులం పేరుతో హత్యలు,దాడులు,అవమానాలు, ఛీత్కారాలు,కులం పేరుతోనే గౌరవించడాలు,చూసి విసిగిన నేను.. అసలు కులం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని చేసిన ఒక ప్రయత్నం. 7వ శతాబ్దానికి ముందు మనం దేశంలో కులాలే లేవు,ప్రజలంతా ఒక్కటే. వారు ఎంచుకున్న వృత్తులే, తర్వాత కాలంలో కులాలుగా స్థిరపరచబడ్డాయి.మైఖేల్ బాంషెడ్ నిర్వహించిన D.N.A పరీక్షలో.. ఈ దేశంలో ఉన్న మూలవాసుల కులాల రక్తం నమూనా ఒకటే. బ్రాహ్మణ- క్షత్రియులు- వైశ్యుల, కుల రక్తనమూనాలతో ఒకే రకంగా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఇంటి పేరుతో ఉన్న వివిధ కులాలు
ఒకే ఇంటి పేరు-వివిధకులాలు
1. నందమూరి- కమ్మ, మాల
2. నారా – కమ్మ,మాల
3. కొత్తపల్లి-మాదిగ,కమ్మ,కాపు
4. పల్లె – కాపు, మాదిగ,మాల,రెడ్డి,గౌడ
5. దాసరి- మాల,కమ్మ,కాపు, మాదిగ,యాదవ్
6. మట్టా- గౌడ, మాదిగ,మాల,మంగలి,కాపు,
7. గంజి- మాల,కమ్మ,కాపు
8. లంక- మాల, మాదిగ,కాపు,కమ్మ
9. సజ్జ/సజ్జల- కమ్మ,కాపు,రెడ్డి,ఎరుకుల
10. బండి- గౌడ,కాపు,మాల, మాదిగ,రెడ్డి,యాదవ,ఎరుకుల
11. పెరికల- మాల,కాపు, మాదిగ,కమ్మ
12. పెరుమాళ్ళ- కాపు,మాల
13. ఘంటా/గంటా- కమ్మ,మాల,కాపు,బలిజ
14. నక్కా- మాల,కాపు,మాదిగ,కమ్మ
15. గొల్ల- యాదవ,మాల
16. గూడపాటి- మాల,కమ్మ,వైశ్య
17. చిరువెళ్ళ- మాల,వైశ్య, బ్రాహ్మణ
18.చిగురుపాటి- కమ్మ,మాల,రెడ్డి
19. మంగం- కాపు,మాల, బ్రాహ్మణ,క్షత్రియ
20. వేమూరి- కమ్మ,మాల,యాదవ, బ్రాహ్మణ
21. పోగూరి- కమ్మ,మాల,కాపు,యాదవ
22. కోడెల- మాల, కమ్మ
23. పిల్లి- గౌడ,శెట్టి బలిజ,మాల,
24. బత్తుల- మాల,కాపు,యాదవ్
25. జుత్తుగ- మాల,గౌడ, శెట్టి బలిజ
26. గుదే- గౌడ,మాల,ఈడిగ
27. యార్లగడ్డ- కమ్మ, మాదిగ, బ్రాహ్మణ
28. తాతపూడి- మాదిగ, బ్రాహ్మణ
29. గూడూరు- గౌడ, రెడ్డి,యాదవ,మాల,మాదిగ
30. సుంకర- కమ్మ,మాల,కాపు,గౌడ,యాదవ్,మంగలి
31.బెజవాడ- గౌడ,మాల,కాపు
32. కొంగర- కమ్మ,మాల,గౌడ,కాపు
33. కోనేరు- కమ్మ, మాదిగ,కాపు,మాల
34. గద్దే- కమ్మ,మాల
35. మంగమూరి- యాదవ్,మాల,కాపు,క్షత్రియ
ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సారూప్యం కలిగిన కొన్ని కులాల జాబితా.ఇంకా సేకరిస్తే, ఏదోకులం ఇంటిపేరు ఇంకో కులంతో కలిసే ఉంటాయి మహారాష్ట్ర లో కూడా షిండే అనే పేరు గల వారు వివిధ కులాల్లో ఉన్నారు.చైనా దేశస్తుడైన హ్యుయాన్ త్సాంగ్ బౌద్ధం ప్రచారానికి భారతదేశం వచ్చి , కొంతకాలం వ్యవసాయ వృత్తి చేపట్టటం వలన, ఆయనను శూద్రకులంగా గుర్తించటం జరిగింది.దీనిని బట్టి శూద్రులు ఎంచుకున్న వృత్తులే కులాలుగా మారాయి. కులం లేని విదేశీయుడు మన దేశంలో, వృత్తి ఆదారంగా కులం పొందటం ఇక్కడ గమనించాల్సిన విషయం.మనుస్మృతి చాతుర్వర్ణ కుల వ్యవస్థ సృష్టించింది. అయితే యజ్ఞాలు చేయటం వలన తక్కువ కులంవారు ఎక్కువ కులంగా మారవచ్చని,లేదా బ్రాహ్మణులను గౌరవించని వారు , తమ కులాన్ని కోల్పోయి తక్కువ కులంలోకి వెళ్తారని చెబుతుంది. ఉదాహరణకు శూద్రుడైన దంతిదుర్గుడు హిరణ్య గర్భ యాగం చేయటం వలన, కులం మరణించి మరలా పుడతారని చెబుతూ.. క్షత్రియుడిగా గుర్తించబడటం.పల్లవులు,చీనాలు, కోడాలు,యవనాలు ఇలా చాలామంది రాజులు క్షత్రియ హోదాను కోల్పోయి, శూద్రులుగా మార్చబడటం ఒక ఉదాహరణ.
బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య అనేవి వర్ణాలుగా మొత్తం దేశం అంతటా ఉంటాయి. అయితే కొంతమంది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల యెక్క ఇంటిపేరు శూద్ర ఇంటి పేరుతో ఉన్నాయంటే, వారు కూడా ఏదైనా ఆజ్ఞలు కట్టుబాట్లు పాటించకపోవడం వలన వారి పూర్వీకుల కాలంలో శూద్రులుగా కులం తగ్గించి ఉండవచ్చు. అందువలనే వారు శూద్రులుగా మిగిలిపోయి ఉండవచ్చు.
కొన్నిసార్లు మనం వృత్తినిబట్టే వ్యక్తి పేరుతో పిలుస్తాము.ఉదాహరణకు మంగలి అంజయ్య, వడ్రంగి శేషయ్య, ఇలా తర్వాత కాలంలో, ఆ వృత్తి పేర్లే పేరుముందు ఉంటూ కులంగా మారి ఉండవచ్చు.దానికి ఉదాహరణ రాయలసీమ,తెలంగాణాలో కొన్ని చోట్ల నేటికి మనిషి పేరుముందు కులం పేరు ఉండటం మనం గమనించవచ్చు.ఇది కుల సంక్రమణం, మార్పు లేకుండా ఉండటానికి కూడా అలా చేసి ఉండవచ్చు.
మొదట ప్రజలు ఒక ఊరిపేరుతో ఒకే చోట వివిధ వృత్తులు చేపడుతూ జీవించేవారు.అయితే తర్వాత కాలంలో అదే ఊరుపేరుతో వారు వేర్వేరు చోట్ల స్థిరపడటం, తర్వాత అదే వృత్తుల ఆదారంగా కులాలుగా గుర్తించడం,కుల కట్టుబాట్లు,కులం పెద్దలు అమలు పరచటం జరిగేది. ఒకే ఇంటిపేరు తో ఉన్న వీరు వృత్తులవలన వివిధ కులాలుగా గుర్తించబడి,ఆధునిక కాలంలో ఆర్థిక, రాజకీయ, ఆధిపత్యం వలన ఈ కుల బావన ఇంకా బాగా బలపడింది.
మొదట వ్యత్యాసం లేకుండా ఒకటిగా ఉన్న శూద్ర కులాలు, తర్వాత వృత్తుల వలన విడివిడిగా మారి.. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేలాయుంచటం మొదలు పెట్టి , ఆర్ధికంగా ఎదిగిన కులాలు మిగతా కులాలను తమ ఆధిపత్యంలో ఉంచుకుంటూ కుల నిచ్చెనలా ఏర్పడ్డాయి.పుస్యమిత్రశుంగుడనే రాజు కాలంలో రాజాజ్ఞ దిక్కరించిన కొంతమంది శూద్రరాజప్రజలను ఊరికి దూరంగా ఉంచి , బలవంతంగా కాటికాపరులుగా,చచ్చిన జంతువుల కళేబరాలు ఎత్తేవారిగా చేయటం వలన మొదట వారు శూద్ర రాజులే అయినప్పటికి తర్వాతి కాలంలో అస్పృశ్యులుగా ఎంచబడినారు.తర్వాత కాలంలో శూద్రులకు జంతువుల పేర్లతో,చెట్లపేర్లతో ఊరి పేర్లు, వ్యక్తిగత పేర్లు మూడు వర్ణాలకంటే అతీతంగా,అసహ్యంగా ఉండేలా కేటాయించటం జరిగింది.ఆ ఊరిపేర్లే తర్వాతికాలంలో ఇంటిపేర్లుగా మారటం జరిగిందని ఒక వాదన కూడా ఉంది.ఉదాహరణకు దున్న,ఎద్దు,పందుల,మేకల,వంటి ఇంటిపేర్లు కలిగివుండటం, పెంటమ్మ,పెంటయ్య పేర్లు కూడా ఉన్నాయి.
ఇంటి పేరుతో కులం పేరు నిర్దారించలేం. కానీ గోత్రం మూలంగా మాత్రమే నిర్ధారించవచ్చు అనే ఒక వాదన కలదు.ఒకే గోత్రంతో కూడా వివిధ కులాలు కలవు.ఉదాహరణకు రేచర్ల, భరద్వాజ అనే గోత్రాలతో అనేక కులాలు కలవు.మరి ఇదికూడా నమ్మదగింది కాదని ఒక వాదన తెరపైకి తర్వాత తెచ్చారు.
దీనివలన అర్ధం అయ్యేది ఏంటంటే.. ఏ విషయంలో కూడా కులం వారిని లబ్ధి పొందేవారు. ఇతర కులాలను తమ కులంతో సమానంగా చూసే స్థాయి, నేటి సమాజంలో శూన్యమే అందువలనే వీరు మొదట ఇంటి పేరుతో అందరూ ఒకే కులమని నిర్ధారించలేమని, గోత్ర సారూప్యం అవసరమంటారు,గోత్ర సారుప్యం చెబితే ఇంకో కారణం చెబుతారు.ఆఖరుకు DNA పరీక్షలో కూడా మూల నివాసుల రక్తనమూనా ఒకటే అని సాంకేతికంగా నిరూపితమైన కూడా ఒప్పుకునే స్థాయిలో నేటి సమాజం లేదనే చెప్పాలి.
R.S శర్మ ప్రకారం మొదటి రోజుల్లో ప్రజలంతా ఒక్కటే వివాహ విషయాలలో, ఏవిధమైన వ్యత్యాసాలు ఉండేవి కాదు. కానీ వృత్తులు కులంగా మారిన తర్వాత ఏ కులం వారు ఆ కులం వారినే, వివాహామాడాలనే‌ సామాజిక నియమం ఏర్పడింది.
కులతత్వం నరనరాన జీర్ణించుకున్న నేటి రోజుల్లో, ప్రజలంతా ఒక్కటే వృత్తులే కులాలుగా ఏర్పడ్డాయి,శూద్రులంతా రక్తసంభందీకులే అంటే చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నాము.అంతే కాకుండా కులం పేరుతో ఇతరులలో ఉన్న గుణాన్ని చూడలేకపోవటం, తక్కువ చేసి చూడటం,కులం పేరుతో దూషించడం,కులాంతర వివాహాలు చేసుకుంటే దానినొక అవమానంగా భావించి చంపేయటం,ఎవరి కులాన్ని వారొక సామాజిక హోదాగా భావిస్తూ,కులం నిచ్చేనలో తక్కువ అని భావించే కులాల ప్రజల్లో ఎన్నో మంచి గుణాలు ఉన్నా వాటిని గుర్తించకుండా కేవలం కులం పేరుతో తక్కువచేసి చూడటం ఒక సామాజిక,మానసిక బలహీనతే.
ఏ కులం కూడా అగ్రకులం కాదు కేవలం ఆధిపత్య కులమే.రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం, సామాజిక ఆధిపత్యం తప్పా ఏం కులం ఇంకో కులం కన్నా గొప్పకాదు,కాబోదు.కేవలం కులం పేరుతో కొంతమంది సాంఘిక హోదాకు దూరమయ్యారని,తక్కువ చూపు చూస్తున్నారని, విద్య,ఉద్యోగం, రాజకీయ, అవకాశాలు,నిరాకరణ,ఆలయప్రవేశం,మంచినీటి బావుల వాడకనిషేదం ఇంకా చాలా విషయాల్లో అసమానతలు ఉన్నాయని వాటిని తొలగించడానికే ఆ కులాలన్నింటిని షెడ్యూల్ కులాలుగా పొందుపరిచి రిజర్వేషన్ కల్పించి వారికి విద్య,ఉద్యోగం,రాజకీయ అవకాశాలు పొందేలా చేయటం ద్వారా తిరిగి సాంఘిక హోదాను పొందేలా చేయాలని డా.బి.ఆర్.అంబేద్కర్ గారు రాజ్యాగంలో పొందుపరిచారు.
ఇకనైనా కులం చరిత్ర తెలుసుకుని కులాలు ఎలా వచ్చాయో తెలుసుకుని ఇతర కులాల ప్రజలు మొదటి కాలంలో అంతా ఒకటే అని గుర్తించి ,కులం రహిత సమాజంగా జీవిస్తారని దాడులు,హత్యలు,కులం పేరుతో అవమానాలు, ఛీత్కారాలు ఆపి సమానంగా చూస్తారని ఆశించే…

Leave a Reply