-పెద్ద ఎత్తున స్పందించి విరాళాలకు ముందుకొస్తున్న దాతలు
-సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేత
విజయవాడ : వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో తమ వంతు బాసటగా నిలిచేందుకు పలువురు దాతలు ఉదారత చాటుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. గురువారం సాయంత్రం పలువురు సీఎంను కలిసి ఎన్జీఆర్ జిల్లా కలెక్టరేట్లో విరాళాలు ఇచ్చారు. విరాళం అందించిన వారిలో…
1. ఎస్.బీ.ఐ అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో రూ.5.87 కోట్లు
2. దేవీ సీ ఫుడ్స్ సంస్థ రూ.1 కోటి
3. కృష్ణా డైరీ చైర్మన్ చలసాని.ఆంజనేయులు రూ.50 లక్షలు
4. చిగురుపాటి సాంబశివరావు రూ.5 లక్షలు (గుడిపూడి, సత్తెనపల్లి)
5. సత్తెనపల్లి నియోజకవర్గం, గుడిపూడి గ్రామస్తులు రూ.1 లక్షా 50 వేలు
6. పిన్నిటి ఉషారాణి రూ. 5 లక్షలు
7. ఎంఎస్ఆర్ ఫుడ్స్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఎం.శేషారావు రూ.2 లక్షల (కాకినాడ)
8. పీవీ సత్యనారాయణ రూ.1 లక్ష, విజయవాడ
9. జాగర్లమూడి చంద్రమౌళి కాలేజీ ఆఫ్ లా స్టూడెంట్స్ రూ.1 లక్ష (గుంటూరు)
10. ఝాన్సీ రాణి, రూ.1 లక్ష, విజయవాడ
11. ఎం.పిచ్చయ్య రూ.1 లక్ష
12. ఐ.వి. సుబ్బారావు ప్రెసిడెంట్ APUWJ, చందు జనార్దన్ ప్రధాన కార్యదర్శి APUWJ
13. గుడిపూడి మిల్క్ ప్రొడ్యుసర్స్ వెల్ఫేర్ సొసైటీ రూ.50 వేలు
14. డాక్టర్ మాధవీలత రూ.50 వేలు
15. ఆరెమండ రవిబాబు రూ.20 వేలు
16. కె.శివసుబ్బారావు, రూ.5 వేలు అందించారు.
బాధితుల పక్షాన నిలిచేందుకు ముందుకొస్తున్నందుకు విరాళాలు అందించిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.