Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

– తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసు

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 19 అక్టోబర్ 2021న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి.. కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది.

ఈ ఘటనలో వైసీపీ నేత దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి. నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌తో పాటు 14 మందిపై పోలీసులుకేసు నమోదు చేశారు . అయితే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు ఈ కేసును మరుగున పడేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. వైసీపీ నేతల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇప్పుడు అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో లేకపోవడంతో, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో తనిఖీ చేశారు. అక్కడా లేడని తెలిసింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో జోగి రమేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

LEAVE A RESPONSE