Suryaa.co.in

Andhra Pradesh

వైజాగ్ బీచ్ కు కొట్టుకువచ్చిన భారీ పాము కళేబరం

వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

LEAVE A RESPONSE