– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి సీఎం భరోసా
ఉండవల్లి: దర్శి నియోజకవర్గం అభివృద్ధి నాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ దర్శి ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి భరోసా ఇచ్చారు. తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలు చేయడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపే నిమిత్తం లక్ష్మి సీఎంను శుక్రవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, ప్రజల సంక్షేమం మన ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతపై పార్టీ నుండి విడుదల చేసిన బుక్లెట్ ను చంద్రబాబుకు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఈ ఏడాది కాలంలో మీరంతా కష్టపడుతున్నారు, మీ కష్టాన్ని నేను చూస్తున్నాను. మనం ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి అమలు చేద్దాం. సంక్షోభంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేచ్చేందుకు మనం వెనుకాడడం లేదన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లండి, ఏడాది పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకోండి. కూటమి ప్రభుత్వ పథకాల అమలుపై వైసీపీ చేస్తున్న దుష్టప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉండటమే మన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. మీరు చేస్తున్న కృషిని చూస్తున్నాను, బుక్లెట్ లో ఈ ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి చూసి చంద్రబాబు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లను సీఎం అభినందించారు.