– పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి సుభాష్
రామచంద్రపురం : తన నియోజకవర్గ ప్రజల్లో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా నే ఉన్నా అంటూ.. భరోసా కల్పిస్తున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. పార్టీ కార్యకర్తలే కాకుండా, కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇవ్వడమే కాకుండా ఆపదలో, కష్ట కాలంలో ఉన్న కుటుంబాలను నేరుగా కలుసుకొని పరామర్శిస్తున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్.
రామచంద్రపురం నియోజవర్గం ఉండూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పిల్లి గణేశ్వరరావు హైదరాబాద్లో జరిగిన ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఈ రోజు ఉండూరు గ్రామంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని మంత్రి సుభాష్ ఓదార్చరు. అలాగే శీలంవారి సావరం గ్రామంలో ఇటీవల మరణించిన చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు స్వర్గీయ నున్నబోయిన శ్రీను కుటుంబాన్ని మంత్రి సుభాష్ కలిసి సంతాపం తెలియజేశారు.
ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని మనోధర్యం కల్పించారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వపరంగా రావలసిన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.