Suryaa.co.in

Telangana

ప్రజా పాలన ధరఖాస్తుల్లో అర్హులైన వారిని గుర్తించండి

– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
– జిల్లా లో ఆరు గ్యారంటీల అమలు పై దృష్టి.
– ప్రజా సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టమైన ఆదేశాలు.

సంగారెడ్డి: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన ధరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను వేగంగా, న్యాయంగా అందజేయాలని స్పష్టం చేశారు.

ప్రతి ధరఖాస్తు ను నిర్లక్ష్యం చేయకుండా, అర్హతను పక్కాగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి…ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల్లో అనవసరమైన జాప్యం జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణానికి అవసరమైన పరికరాలను నిర్ణీత ధరలకు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇసుక రీచ్‌లను మండల స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా స్టీల్, సిమెంట్, సామగ్రి అందుబాటులో ఉండేలా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణానికి భూమి లేని వారు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని, వారికి సర్దుబాటు చేయదగిన ప్రభుత్వ భూమిని గుర్తించాలి అని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల విషయానికొస్తే, మహిళా సంఘాల ద్వారానే రుణాలను అందించాలన్న సూచన చేశారాయన. స్వయం సహాయక మహిళా సంఘాలు ఈ విషయంలో కీలకపాత్ర పోషించాలన్నారు. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన పెరగడంతోపాటు, నిర్మాణం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఆరు గ్యారంటీల అమలు పై దృష్టి

ప్రభుత్వం ప్రజలకు హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిష్పక్షపాతంగా, అర్హులైన వారికి పూర్తిస్థాయిలో అమలు చేయాలని మంత్రి అన్నారు. ఈ గ్యారంటీలలో ముఖ్యమైన జీరో విద్యుత్ బిల్లు: విద్యుత్ వినియోగంలో నిర్దిష్ట పరిమితికి లోబడి వినియోగించిన కుటుంబాలకు విద్యుత్ బిల్లును మాఫీ చేయడం. ఈ ప్రయోజనం లబ్దిదారులకు నిరోధాలు లేకుండా అందించాలి. సబ్సిడీ గ్యాస్ పంపిణీ: మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, గ్యాస్ కనెక్షన్లపై రాయితీలను సమర్ధవంతంగా అమలు చేయాలి.

పేదలకు సన్నబియ్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.మహిళా సంఘాలకు రుణాలు స్వయం సహాయక సంఘాల కు రుణాల వితరణ వేగవంతం చేయాలని పేర్కొన్నారు.పక్కా ఇల్లు ప్రతి కుటుంబానికి ఉండాలన్న లక్ష్యంతో ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.రాజీవ్ యువ వికాసంయువతను సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దిశగాఉపాధి అవకాశా లు కల్పించాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం అర్హులైనవారికి వెంటనే సేవలు అందించాలన్నారు.

LEAVE A RESPONSE