Suryaa.co.in

Andhra Pradesh

వెన్నుపోటు అంటే బాబాయికీ గొడ్డలిపోటు వేయటమే కదా జగన్?

– అరాచక పాలన సాగించిన జగన్ కు, అభివృద్ధి, సంక్షేమం అంటే నచ్చదు
– మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

గిద్దలూరు: “వెన్నుపోటు” అంటే బాబాయిని గొడ్డలి పోటుతో చంపడమే కదా జగన్ ..? అని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు. బుధవారం కొమరోలు మండలంలో పర్యటించిన అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వెన్నుపోటు దినోత్సవం అంటూ వైసిపి నాయకులు రాద్దాంతం చేయడం పై స్పందిస్తూ.. వెన్నుపోటు అంటే సొంత బాబాయిని గొడ్డలితో చంపడమేనా..? లేక తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టడమేనా..? లేదా చెల్లికి ఇవ్వవలసిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమేనా..? ఇది కాదా వెన్నుపోటు అంటే జగన్ అంటూ అశోక్ రెడ్డి ప్రశ్నించారు.

LEAVE A RESPONSE