Suryaa.co.in

Andhra Pradesh Crime News

ఇదో పుష్ప సినిమా ‘క్యాబేజీ గంజాయి కహానీ’

పుష్ప సినిమాలో అల్లు అర్జున్..ఖాకీల కళ్లు గప్పి, ఎర్రచందనాన్ని తన తెలివితో తరలించే దృశ్యాలను పుష్ప సినిమాలో చూశాం. అల్లు అర్జున్ అంతటి వాడు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో రవాణా చేస్తే, తాను క్యాబేజీతో గంజాయిని స్మగ్లింగ్ చేయలేనా అన్న ఆలోచన.. కొందరు మేధావులకు వచ్చిందట. దానితో క్యాబేజీ బస్తాల కింద గంజాయి ఉంచి, ఒడిస్సా నుంచి పంపించారట. విశాఖపట్నం పెందుర్తి వరకూ ‘క్యాబేజీ గంజాయి కథ’ నిరాటంకంగా సాగింది. కానీ పెందుర్తిలో క్యాబేజీ గంజాయి కహానీ అడ్డం తిరిగి, పోలీసులకు అడ్డంగా దొరికిపోయిందట.ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వాహనాన్ని సీజ్ చేశారు. సో.. పు ష్ప సినిమా ఇలా ఎందరికో స్పూర్తిదాయకమైన ఉపాథి ఇస్తుందన్న మాట.

LEAVE A RESPONSE