Suryaa.co.in

Andhra Pradesh

మూడు గేట్లు పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి

అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా
– అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

అద్దంకి : మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం,బాలత్రిపుర సుందరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు, స్థానిక మహిళలు గుమ్మడికాయ తో దిష్టితీసి హారతులు ఇచ్చి ప్రచారానికి స్వాగతం పలికారు,స్థానిక మైనారిటీ ఎస్సీ,బీసీ,ఎస్టీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ టిడిపి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రవికుమార్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి, సంక్షేమ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకుంటూ, వైసిపి నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాల వ్యాపారాలు ప్రజలకు తెలియజేసి గ్రామాల అభివృద్ధి కోసం,రాష్ట్ర అభివృద్ధి కోసం,రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిత కోసం, ప్రజలకు అప్పులతో కూడిన సంక్షేమం కాకుండా.. సంపద సృష్టించి తద్వారా మరింత సంక్షేమాన్ని అందించే విధంగా ఉండాలని అందుకుగాను మే 13 వ తేదీ జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్య మంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు.

నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేసి ఆగిపోయిన అద్దంకి నియోజకవర్గం అభివృద్ధిని మరల పూర్వ వైభవం దిశగా కొనసాగిద్దామని తెలిపారు. గత తెలుగుదేశంపార్టీ ప్రభుత్వంలో మణికేశ్వరం గ్రామంలో పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామమైన మణికేశ్వరం ఎస్సీ కాలనీవాసులకు 5సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నివేశ స్థలాలు ఇవ్వకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నివేశ స్థలాలతో పాటు గృహాలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. చాలాసార్లు మణికేశ్వరం గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకోవడం జరిగిందని కానీ గుండ్లకమ్మ ఈ పరిస్థితిని వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. నాడు ప్రభుత్వమే గుండ్లకమ్మ నదిలో చేప పిల్లలను విడుదల చేసి నిషేధ సమయంలో ఆర్థికంగా చేయూత నందించడం జరిగిందని గుర్తు చేశారు,

గుండ్లకమ్మ లో నీరు లేని కారణంగా నేడు జాలర్ల దుస్థితి దారుణంగా ఉందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి నాలుగు సంవత్సరాలు అయినా మూడు గేట్లు పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. గుండ్లకమ్మ నదిలో రోజు వందలాది ట్రాక్టర్లు ఇసుకను అమ్ముకుంటూ లక్షలాధి రూపాయలు గడిస్తున్నారు న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశంపార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE