పర్చూరును రోల్ మోడల్ గా చేస్తా

– చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు

•పర్చూరులో అభివృద్ధిని పునః ప్రారంభిస్తా
•అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే నా లక్ష్యం
•పేదలందరికీ నివేశన స్థలాలు అందిస్తా
•తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి బాట పట్టించే సత్తా ముందుచూపు చంద్రబాబుకే ఉందని, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

ఆదివారం చిన్నగంజాం మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు… రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు సారథ్యాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలు,ఆకాంక్షలకనుగుణంగా పాలన సాగించే అనుభవం కార్యదక్షత ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

శ్రీకాళహస్తి లో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు తనను తాను డ్రైవర్ గా అభివర్ణించారని పేర్కొన్నారు. ప్రజలను రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపించే డ్రైవర్ ని తాను అని చెప్పారని, ప్రజల కోసం ఆయన తీసుకున్న బాధ్యత అన్నారు.అనుభవం, బాధ్యత ఉన్న నేతగా మన కోసం చంద్రబాబు నాయుడు చేసే పోరాటంలో మనం అండగా ప్రజలందరూ అండగా నిలవాలన్నారు.

తాను డ్రైవర్ అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని తెలిపారు. జగన్ అసమర్థ, అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని వివరించారు.అన్ని రాష్ట్రాలు జట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే మన రాష్ట్రం వెనుక బడిపోయిందన్నారు.

జగన్ రెడ్డి రివర్స్ పాలనతో ప్రజలు జీవితాలు రివర్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. మన అందరి కోసం దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని, ప్రజలందరి కోసం నిలబడే నాయకుడు చంద్రన్న మాత్రమే అన్నారు.మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటారని చెప్పారు.

రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ నివేశన స్థలాలు అందిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 25 వేల మందికి ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి పర్చూరును రోల్ మోడల్ గా చేస్తామన్నారు. అన్నదాతల సంక్షేమానికి బృహత్తర కార్యక్రమం చేపడతామన్నారు. అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. యువత అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply