అనుక్షణం అండగా ఉంటా

-ఈసారి ఎన్నికలు మన పల్నాడు అభివృద్ధి గురించే…
-ప్రతిఒక్కరూ మనసు పెట్టి కలిసికట్టుగా పనిచేయాలి
-మాచర్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి
-గెలిచిన వెంటనే దుర్గి నీటి సమస్యను పరిష్కరిస్తాం
-నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
-దుర్గి మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం

ఈ ఎన్నికలు మన పల్నాడు ప్రాంత అభివృద్ధికి సంబధించినవి అని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కలసికట్టుగా పనిచేస్తేనే మాచర్ల గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. ఆదివారం దుర్గిలోని సత్యసాయి కళ్యాణ మండపంలో దుర్గి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ఐదేళ్లలో తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమానికి, పల్నాడు అభివృద్ధికే తన ఎంపీ పదవిని, సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. మరోసారి పల్నాడు ప్రజలు ఆశీర్వదిస్తే అనుక్ష ణం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటూ…
మండలంలోని ప్రతి గ్రామ నాయకులను విడివిడిగా కలిశారు. నాయకులని ఏకతాటి మీదకు తెచ్చేలా, సమిష్టిగా పనిచేసేలా శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడారు. ప్రతి గ్రామంలో అధికంగా నీటి సమస్య ఉందని నాయకులు శ్రీ కృష్ణ దేవరాయలు దృష్టికి తీసుకురాగా,, దీనికకి వాటర్‌ ట్యాంక్‌ లను ఏర్పాటు చేస్తానని తెలిపారు. అధికారంలోకి రాగానే ఎంపీ నిధులతో నీటి సమస్య పరిష్కారానికి వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వరికె పుడిశెల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని, గోదావరి జలాలతో సాగర్‌ కుడి కాలవకు నీటి తెచ్చుకునే ప్రాజెక్టు ను ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు.

Leave a Reply