-యుద్దప్రాతిపదికన వెంటనే పంపిణీ చేయించాలి
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
పింఛన్ల డబ్బును కూడా సొంతానికి మళ్లించింది కాక ఆ నెపం ఈసీపైకి నెట్టాలని చూస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. వినుకొండ ఒకటో వార్డు సిద్ధార్థ నగర్‌కు చెందిన 29 కుటుంబాల వారు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వినుకొండ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడారు. వాలంటీర్లను ఈసీ విధులకు దూరంగా పెట్టినా వారిని పావులుగా వాడుకుంటూ ఈ విషయంలో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు వాట్సాప్ గ్రూపులు, సామా జిక మాధ్యమాల్లో వైసీపీ, వారి అనుకూల వాలంటీర్లు చేస్తోన్న అబద్ధపు ప్రచారాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామన్నారు. ఈసీ వాలంటీర్లను పక్కన పెట్టమన్నప్పటికీ సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పింఛన్ల పంపిణీ చేపట్టకపోవడానికి నిధుల కొరతే కారణమని, వేరే కారణం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారు ల ద్వారా యుద్ధప్రాతిపదికన పింఛన్ల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లకు ఇవ్వాల్సిన డబ్బును జగన్ ఈ సారి సొంత కాంట్రాక్టర్ల బిల్లులకు దోచిపెట్టి ఇప్పుడు దొంగ నాటకాలాడుతున్నారన్నారు. ఖజానాలో సరిపడా డబ్బుల్లేకుండా చేసింది కాక తమ దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి ఈసీ, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై బురదజల్లాలని చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో వినుకొండ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిరద న్నారు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వార్డుల్లో కనీస సమస్యలు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ రాగానే మొదటి ప్రాధాన్యతగా తీసుకొని వార్డుల్లోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ టీడీపీపై నమ్మకంతోనే పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 29వ వార్డులో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, బ్రిడ్జి నిర్మాణాన్ని జీవీ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. 2019లో వినుకొండ తాగునీటి పథకానికి ఆంజనేయులు రూ.160 కోట్లు తీసుకొస్తే.. తర్వాత ఎమ్మెల్యే అయిన బొల్లా ఆ పనులనే మూలన పడేశారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే తాగునీటి పథకాన్ని త్వరిత గతిన పూర్తిచేసి పట్టణ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. వినుకొండ అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ ఆంజనేయులు గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంధం సుబ్బారావు, వల్లూరి మురళీకృష్ణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.