-కేంద్రం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరిస్తే… ఉన్న కంపెనీలను మూసివేస్తున్న చరిత్ర కేసీఆర్ ది
-పరీక్ష పత్రాన్ని బెదిరించి ఫోటోస్టాట్ తీసుకుంటే… పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు?
-కరీంనగర్ ప్రెస్ మీట్ లో బండి సంజయ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రేపు హైదరాబాద్ వస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, ప్రజలంతా పరేడ్ గ్రౌండ్ కు విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నా. కమలాపూర్ లోని టెన్త్ క్లాస్ విద్యార్ధి హరీష్ ను 5 ఏళ్లపాటు డిబార్ చేయడం దుర్మార్గం.
ఎవరో ఎగ్జామ్ సెంటర్లోకి చొరబడి హరీష్ రాస్తున్న పరీక్ష పత్రాన్ని బెదిరించి ఫోటోస్టాట్ తీసుకుంటే… పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు? పోలీసుల వైఫల్యంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం టెన్త్ క్లాస్ విద్యార్థిని బలి చేయడం దుర్మార్గం.
కేసీఆర్… మీకు తెలంగాణ అభివృద్ధి కావాలా? రాజకీయాలు కావాలా తేల్చుకో…తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం ప్రధాని వస్తుంటే అడ్డుకోవాలనుకోవడం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నట్లే.కేసీఆర్ కు తెలంగాణతో ఎప్పుడో తెగదెంపులయ్యాయి. అభివృద్ధి కావాలని భావిస్తే కేసీఆర్ ప్రధాని సభకు రావాలి.. కేంద్రం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరిస్తే… ఉన్న కంపెనీలను మూసివేస్తున్న చరిత్ర కేసీఆర్ ది.