మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు : తమ ముఖ్యమంత్రి,.. తమ బాస్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశిస్తే తాను తప్పకుండా నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు… నెల్లూరు నగరంలోని రాజన్న భవన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి , చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆయన ఏ బాధ్యతలు అప్పగిస్తే దానిని స్వీకరిస్తానని మంత్రి అనిల్ ప్రకటించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల కుటుంబంలో కలహాలు ఉంటే ఆ కుటుంబంలోనే తేల్చుకుంటామన్నారు. వచ్చే నెలలో గా పెన్నా బ్యారేజ్ పనులు పూర్తి చేస్తామని మాజీ మంత్రి అనిల్ తెలిపారు… తాను ఇరిగేషన్ మంత్రిని కాదని ఇరిగేషన్ కు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దు అంటూ ఆయన సూచించారు… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాంతం పని చేస్తామని తామంతా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులమన్నారు