– ఉపాధి హామీ కింద పంటకుంటల తవ్వకం, చెక్ డ్యాముల నిర్మాణం
– ఉరవకొండ నియోజకవర్గంలో మెగా డ్రిప్ పథకానికి రూ.890 కోట్లు
-మెగా డ్రిప్ పథకంతో 50 వేల ఎకరాలకి సాగునీరు వసతి
– టిడిపి వ్యవసాయాన్ని పండగ చేస్తే.. వైసీపీ రైతుల్లేని రాజ్యం చేసింది
యువగళం పాదయాత్ర కూడేరు నుంచి నారా లోకేష్
అనంతపురం జిల్లాలో వర్షపాతం దేశంలోనే అతి తక్కువ. కరవునేలలో తాగునీటికీ ఇబ్బందులే. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాం. పంటకుంటలు తవ్వించి, చెక్ డ్యాములు నిర్మించి దేశంలోనే అనంతపురానికి మొదటిస్థానంలో నిలిపాం. భూగర్భజలాలు పెరిగాయి. డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందించాం. నీటిని పొదుపుగా వాడుకుని రైతులు బంగారు పంటలు పండించారు. అనంతపురం జిల్లాలో యువగళం పాదయాత్ర సాగుతుండగా, కూడేరు వద్ద మండువేసవిలో కనిపించిన ఈ పచ్చని పంటలు టిడిపి ప్రభుత్వం రైతులకు చేసిన మేలుకు పచ్చని సాక్ష్యం. ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలో రూ.890 కోట్లతో మంజూరు చేసిన మెగా డ్రిప్ పథకంతో 50 వేల ఎకరాలు సాగవుతున్నాయి. ఇదీ తెలుగుదేశం ముందుచూపు. ఇదీ వ్యవసాయాన్ని పండగ చేసిన చంద్రబాబు పాలన. వ్యవసాయానికి సాయం అయ్యే ఒక్క మంచి పనీ చేయని జగన్ రెడ్డి, రైతుల మోటార్లకి మీటర్లు మాత్రం ఉరితాళ్లలా బిగిస్తున్నారు. రైతు రాజ్యం తెస్తానని, రైతుల్లేని రాజ్యం చేస్తున్నారు వైసీపీ పాలకులు.