ఏసీబీ యాప్ పెడితే జగన్ రెడ్డిపై నేనే మొదటి ఫిర్యాదు ఇస్తా

– దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో పర్యటించిన లోకేష్.
– కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నమంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్థులు.
– అధికార పార్టీ వేధింపుల నేపథ్యంలో ఎంపీటిసిలు బుల్లమ్మాయి, శ్రీనివాస రావు, సర్పంచ్ సిద్దెల శ్రీవాణి నివాసాలకు వెళ్లి పరామర్శించిన లోకేష్
– మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన

రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవ్వడం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. టిడిపికి చెందిన 54 మంది సీనియర్ నాయకుల పై కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసుతో పాటు నా పై 12 కేసులు పెట్టారు. 3200 మంది కార్యకర్తల పై అక్రమ కేసులు బనాయించారు.

తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్న ఒక కుటుంబాన్ని బెదిరించి సిఎం పర్యటన ఉందంటూ పోలీసులు వాహనం తీసుకెళ్లిపోయారు. బీహార్ లో ఇలాంటి ఘటనలు జరిగేవి అని విన్నాం ఇప్పుడు ఏపిలో చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికి ఏకంగా కొత్త చట్టాలు చేశారు. ఇంట్లో మద్యం దొరికితే పోటీకి అనర్హులు అని చట్టం తెచ్చి వైసీపీ వాళ్లే ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో మందు సీసాలు పెట్టి, సీసి కెమెరా ఫుటేజ్ లో దొరికిపోయారు.

తెనాలి లో టిడిపి కౌన్సిలర్ గా పోటీ చేసిన అభ్యర్థి ఇంట్లో వైసీపీ వాళ్లే, మందు సీసాలు పెట్టడం అందరూ టివిలో చూశారు. నామినేషన్ పత్రాలు చించేయడం, బెదిరింపులు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల దుర్మార్గాలు చేశారు.మంగళగిరిలో అయిత నామినేషన్ వేసిన దగ్గర నుండి ఎన్నికల వరకూ వేధిస్తూనే ఉన్నారు. ఆఖరికి పోలీసుల పై ఒత్తిడి తెచ్చి మా కార్యాలయాల్లో డబ్బు ఉంది అంటూ దాడులు కూడా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మెజారిటీ ఎంపిటిసిలు గెలిచాం.

అప్పటి నుండి మళ్ళీ వేదింపులు. వైసిపి కి మద్దతు ఇవ్వాలని ఆఖరికి కులాన్ని కూడా ప్రయోగించారు. జనసేన తరపున గెలిచిన ఎంపిటిసి శ్రీనివాస్ గారి ఆస్తుల పై దాడులు మొదలుపెట్టారు. అయినా లోంగకపోయేసరికి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. విచిత్రం ఏంటంటే ఆ తేదీన, ఆ సమయానికి అసలు ఆ వ్యక్తి అక్కడ లేనే లేడు. కేసులకు భయపడే వారు ఎవ్వరూ లేరు…పోరాడుతూనే ఉంటాం. ఎంపీపీ గెలుస్తాం అన్న అక్కసుతో మా చెల్లికి బిసి సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.

అధికారంలోకి వస్తే మూడు నెలల్లో ఈమని రూపురేఖలు మారుస్తా అన్న ఎమ్మెల్యే ఎక్కడ? మూడు నెలల్లో రోడ్లు వేయిస్తా అన్న వ్యక్తి మూడు ఏళ్లు అయినా అడ్రస్ లేరు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎమ్మెల్యే గాడిదలు కాస్తున్నారా? ఆయన నియోజకవర్గానికి చేసింది ఎంటి? ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోవడం లేదు.

ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తున్నా రోడ్లు వేయించి, అభివృద్ధి చేస్తానని, పేదల ఇళ్లు కూల్చనని రాసిస్తే ఎంపీపీ గెలుపుకు మేమే మద్దతిస్తాం. ఆఖరికి గ్రామ సర్పంచ్ ని సైతం ఇబ్బంది పెడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యకుండా అడ్డుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రభుత్వమే కాజేస్తుంది.

ఎమ్మెల్యే గా గెలిపించింది అభివృద్ధి కోసం పేదల ఇళ్లు కొట్టడానికి కాదు.మంగళగిరి పౌరుషం ఏంటో ఎమ్మెల్యే కి చూపిస్తాం. కేసులు పెట్టి వేదిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు.మంగళగిరి లో చరిత్ర తిరిగిరాస్తాం. టిడిపి జెండా ఎగరేస్తాం. మారుమూల ఉన్న కుప్పాన్ని అభివృద్ధి చేసాం …మంగళగిరి ని కూడా అభివృద్ధి చేస్తాం.

జగన్ రెడ్డి అవినీతి రహిత పాలన అంటే మూడేళ్ల చిన్నపిల్లాడు కూడా నవ్వుతున్నాడు. ఏసీబీ యాప్ పెడితే జగన్ రెడ్డి పై నేనే మొదటి ఫిర్యాదు ఇస్తా.ఇసుక లో డబ్బు కొట్టేస్తుంది జగన్ రెడ్డే. కల్తీ మద్యం లో డబ్బు కొట్టేస్తుంది జగన్ రెడ్డే. సొంత కార్యకర్తల భూములు కొట్టేస్తున్నారు వైసీపీ నేతలు. ఏసీబీ ని ప్రతిపక్ష నాయకుల్ని వేదించడం కోసం వినియోగించారు.

సొంత పార్టీ ఎంపి రఘురామ కృష్ణమరాజు గారిని కొట్టడం సిఎం లైవ్ లో చూసారట. తప్పులు ఎత్తిచూపిన వారిని తన్నడానికి ఏసిబి ని వాడారు. అడుగడుగునా అవినీతి చేస్తూ అవినీతి రహిత పాలన అనడం జగన్ రెడ్డికే చెల్లింది. బియ్యం పంపిణీ మానేసి నగదు బదిలీ వెనుక పెద్ద స్కాం ఉంది. గ్యాస్ సబ్సిడీ ఎలా గాల్లో కలిసిపోయిందో అలానే బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా ఎత్తేసే కుట్ర జరుగుతోంది.

ఇప్పటికే రేషన్ లో ఇచ్చే సరుకులు తగ్గించారు. ఇక బియ్యం కూడా ఎత్తేసి పేదలకు కూడు దూరం చేస్తారు. ఆహార భద్రత గురించి 40 ఏళ్ల క్రితం ఆలోచించి రూ.2 కే కేజీ బియ్యం అందించే పథకం
lokesh-shop తెచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ తరువాత దేశమంతా ఈ స్కీం అమలు అవుతోంది. రాయలసీమ ప్రాంతంలో పేదలు అన్నం తిన్నది ఎన్టీఆర్ గారి కిలో 2 రూపాయిల బియ్యం తోనే ఇప్పుడు ఆహార భద్రత గా ఉన్న బియ్యం పథకం నుండి తొలగించడం దారుణం.

తేదీలు మార్చి ఒక ఏడాది అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ నొక్కేసారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లో పెద్ద కుంభోణానికి పాల్పడుతున్నారు. యూనిట్ విద్యుత్ రూ. 4.20 పైసలకి టిడిపి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తే జగన్ రెడ్డి గగ్గోలు పెట్టారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో యూనిట్ రూ.20 పెట్టి కొంటున్నారు. సుమారుగా వెయ్యి కోట్లు ఈ కొనుగోళ్ల వ్యవహారంలో కొట్టేస్తున్నారు. టిడిపి హయాంలో చేసుకున్న పిపిఏ లరద్దు వల్ల రాష్ట్రం ఇప్పుడు అంధకారం అయ్యింది. లేని దిశ చట్టం ఉందని మహిళల్ని మోసం చేసారు. మహిళల్ని హత్య చేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారు.

Leave a Reply