(భూమా బాబు)
కట్ డ్రాయర్ల జాకీ కంపెనీని సైతం రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిన ఘనత జగన్ రెడ్డిది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రానికి చీకటి రోజులు. ఉపాధి కరువై ప్రజల వలసలు పెరిగాయి.
కానీ, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ మళ్లీ పురోగతి పథంలో దూసుకుపోతోంది. ఏడాదిలోనే చిత్రపటం పూర్తిగా మారిపోయింది!
రేమండ్ గ్రూప్ రాక, పరిశ్రమల పండుగ!
ఇవ్వాళ, ప్రముఖ రేమండ్ గ్రూప్ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఏకంగా ₹1,201.95 కోట్లతో 3 గ్రామాల్లో (రాప్తాడు, గుడిపల్లి, టేకులోడు) టెక్స్‌టైల్స్, దానితో పాటు ఆటో కాంపొనెంట్, ఏరోస్పేస్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిశ్రమల ద్వారా 6,571 మందికి పైగా యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
జగన్ హయాంలో పరిశ్రమల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికే భయపడ్డారు. ఎక్కడ తమ వ్యాపారాలను మూసేసి పారిపోవాలోనని అప్పటికే ఉన్న పరిశ్రమల పారిశ్రామికవేత్తలు ఆమరరాజా వరకు భయం భయంగా బతికారు. కానీ, నేడు చంద్రబాబు గారి దార్శనికతతో, పారిశ్రామిక అనుకూల విధానాలతో పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కడుతున్నారు.
జగన్ విధ్వంసం, చంద్రబాబు నిర్మాణం!
అనంతపురం జిల్లా రాప్తాడులో రూ.330 కోట్లతో వస్త్రాల పరిశ్రమ ఏర్పాటుకు 26.87 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా టేకులోడు వద్ద రూ.256 కోట్లతో ఏరోస్పేస్ కాంపొనెంట్ సంస్థ ఏర్పాటుకు 29.51 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతపురం జిల్లా గుడిపల్లి వద్ద రూ.430 కోట్లతో ఆటో కాంపొనెంట్ సంస్థ ఏర్పాటుకు 24.39 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
ఈ కంపెనీలకు ప్రభుత్వ పాలసీల ప్రకారం ప్రోత్సాహకాల ప్యాకేజీ కూడా వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖల అధికారులకు ఆదేశాలు అందాయి.
ఇది కదా పాలనంటే!
చంద్రబాబు దార్శనికతకు, పరిపాలనా సామర్థ్యానికి ఇది నిదర్శనం. ఒకప్పుడు జగన్ రెడ్డి కలలో కూడా ఊహించలేని అభివృద్ధి ఇది. యువత భవిష్యత్తును అంధకారం చేసిన జగన్ రెడ్డి పాలనను పక్కకునెట్టి, నేడు చంద్రబాబు గారు రాష్ట్రానికి కొత్త ఆశను, నమ్మకాన్ని కల్పిస్తున్నారు.
కేవలం ఏడాదిలోనే ఈ అద్భుతమైన మార్పును చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ గా మారడం ఖాయమని స్పష్టమవుతోంది!