భార్య మీద కోపం వస్తే…..

బ్రిటీష్ వాళ్ళు బార్ కెళ్ళి పోతాడట.
ఫ్రెంచ్ వాళ్ళయితే ప్రియురాలి దగ్గరకి వెళ్ళిపోతాడట.
జర్మనీ వాళ్శయితే సైన్యంలో చేరి యుద్దానికి వెళ్ళిపోతాడట.
అమెరికాలో అయితే అడ్వొకేట్ దగ్గరకి వెళ్ళిపోతాడట డైవోర్స్ కోసం.
జపాన్ వాళ్ళయితే అత్మహత్య చేసుకుంటాడట.
మరి భారతీయుడైతే……!
బిక్కమొహంతో ఒక్కడే ఓ చోట కూర్చుంటాడట.
లేదా,
సముద్రం దగ్గరకి పోతాడట.
దూకేద్దాం అనుకుంటాడట.
కానీ, దూకడట.
మందు కొట్టాలనుకున్నా….
మళ్ళీ ఇంటికి పోతే ఎక్కడ కొడుతుందోనన్న భయంతో కొట్టడట.
ఒక్కడే గట్టుమీద కూర్చుని నీళ్ళలోకి రాళ్ళేసుకుంటూ కూర్చుంటాడట.
కాసేపటి తరువాత శతకోటి సమస్యలలో తనకొచ్చిందో బోడి సమస్య అనుకుంటాడట.
అందుకే భారత దేశంలో భర్త అలిగి బయటకిపోతే ఎప్పటికయినా తిరిగి వస్తాడులే అనే నమ్మకంతో భార్యలు ఉంటుంటారట.