November 17, 2026

రాజు తలచుకుంటే దెబ్బలకేం కొదవ ?

రాజు తలచుకుంటే దెబ్బలకేం కొదవ ? సీఎం గారు కావాలనుకుంటే పండగలకేం తక్కువ ? రామోజీరావు గారు నిస్సందేహంగా most successful entrepreneur . నేను మా ఎంబీఏ విద్యార్ధులకు పాఠాలు చెప్పేటప్పుడు రామోజీరావు గారి enterprising abilities , qualities గురించి ఎన్ని సార్లు వివరించానో ! అలాంటి successful entrepreneurs మన దేశంలో , రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారో లెక్కే లేదు .

జయంతి షిప్పింగ్ కార్పోరేషన్ ధర్మతేజ దగ్గర నుండి పాతాళగంగ ప్రాజెక్టుతో వీర పాపులరయిన ధీరుబాయి అంబానీ , తర్వాత కాలంలో ఆదానీయే ఇండియా ఇండియాయే ఆదానీ అని పిలిపించుకుంటున్న గౌతమ్ ఆదానీ వరకు ఎంతో మంది ఉన్నారు . ఆ లెక్కనయితే వీరందరి జన్మదినాలను పండగలుగా సెలబ్రేట్ చేయవలసి వస్తుంది .

బహుశా రామోజీరావు గారి పత్రికారంగ వైభవం వలన చంద్రబాబు గారు ఆయన జన్మదినాన్ని రాష్ట్ర పండగగా నిర్వహిస్తానికి నిశ్చయించి ఉండొచ్చు . అయితే ఈయన కన్నా గొప్ప పత్రికారంగ నిస్వార్ధ సేవకులు ఉన్నారు . కాశీనాధుని నాగేశ్వరరావు , ముట్నూరు కృష్ణారావు వంటి వారు . వారందరికీ కలిగించని ప్రివిలేజుని రామోజీరావు గారికి కలిగించారు . ఎందుకని?
1983 లో నాటి కాంగ్రెస్సుని అధికారం నుండి లేపేసి తెదేపాను అధికారంలో తెచ్చేందుకు తన వంతు పాత్ర పోషించినందుకా ?! 1984 లో పదవీచ్యుతుడయిన యన్టీఆర్ని తిరిగి అధికార పీఠం పైన కూర్చోపెట్టటంలో సహకరించినందుకా ? కాదంటే కాదు . మరెందుకు ?

1995 లో యన్టీఆర్-లక్ష్మీపార్వతులను బద్నాం చేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసినందుకే అయిఉండాలి . ఇప్పటివరకు చంద్రబాబు గారి హితోభిలాషులుగా ఆయన , అయన పేపర్ ఉన్నందుకే అయిఉండాలి .

అయిననూ రాష్ట్ర పండగగా ప్రకటించేందుకు చాలా దమ్ము ధైర్యం ఉండాలి . రామోజీరావు గారికి ఎంత మంది అభిమానులు ఉన్నారో అంతే మంది వ్యతిరేకులు ఉన్నారు , ఉంటారు . అయిననూ ధైర్యంగా ప్రకటించిన చంద్రబాబు గారిని అభినందిస్తున్నాను . రాజకీయంగా ఆయనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో కాలం నిర్ణయిస్తుంది .

  • ప్రొఫెసర్ దోగిపర్తి సుబ్రమణ్యం
Total Visitors: 3,461,841