Suryaa.co.in

Andhra Pradesh

నిజాలు రాస్తే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారి పోయాడు

– బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

నిన్న ఆంధ్రజ్యోతి విలేఖరి నేడు ఏకంగా ఈనాడు కార్యాలయం మీద దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నిజాలు రాస్తే , చెప్పితే తట్టుకోలేని స్థితికి జగన్ దిగజారి పోయాడు అనేదానికి ఈ సంఘటనలే ఉదాహరణలు. జగన్ ఓడిపోతున్నాడు అనేది నిజం , ఆ నిజాన్ని ఉహించుకోలేక పోతున్న నేపథ్యంలోనే ఇలాంటి అప్రజాస్వామిక , అనైతిక దాడులకు పాల్పడుతున్నాడు.

స్వయంగా పత్రికా యజమాని అయ్యి మీడియా మీద పనిచేస్తున్న సిబ్బంది మీద దాడులకు తెగబడడం చూస్తుంటే, జగన్ లాంటి విధ్వంసకారికి అధికారం కట్టబెట్టినందుకు సమాజం సిగ్గుపడుతోంది. మీడియాను అణగతొక్కాలనే నియంత స్వభావికులు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు అని గుర్తుంచుకో సీఎం గారు!

LEAVE A RESPONSE