Suryaa.co.in

Andhra Pradesh

హోంమంత్రి అనుచరుడికే ఇలా జరిగితే.. సామాన్య ప్రజలకు భద్రత ఉంటుందా?

– దళితుడైన మహేందర్ కు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది? : మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు
– తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పర్యటన
– ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన దళిత యువకుడు మహేంద్ర కుటుంబానికి మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, కేస్ జవహర్, పీతల సుజాత, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు, తెదేపా నాయకులు తదితరుల పరామర్శ

ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… బొంత మహేంద్ర మరణం ఈ రాష్ట్రం మొత్తం కలచి వేసింది. చిన్న కుర్రాడు 21 సంవత్సరాల వయసు పోలీసులు వేది ఇప్పుడు తాడు లేక ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరం. నాలుగు రోజుల తర్వాత పరామర్శ కి వచ్చామంటే, మా దళితుడు మా సోదరుడు చనిపోయిన కూడా పరామర్శకు రానీయకుండా దిగ్బంధనం చేశారు ఈ పోలీసులు…మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాలతో ఈరోజు మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించి స్వంతన తో కూడిన మాటలు మాట్లాడి ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అనే మెసేజ్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము.

స్థానికంగా ఉన్న జడ్పిటిసి గారు మహేంద్ర మరణం గురించి చెబుతుంటే నా హృదయం కలచివేసింది చాలా బాధ కలుగుతుంది కళ్ళు చమరుస్తున్నాయి. ఒక నాటకీయ పక్కిలో ఈ కార్యక్రమం అంతా జరిపారు. ఫ్లెక్సీ చింపారు అని మహేంద్ర ని పోలీస్ స్టేషన్ పిలిపించి మానసికంగా హింసించారు ఈ పోలీసులు. ఈ మానసిక వేధింపులు వల్లే మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేంద్ర ప్రాణం పోవడానికి కారణమైన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏమి చేయాలి?

మహేంద్ర చనిపోయిన తర్వాత పోలీసులు ఆడిన డ్రామా చూస్తుంటే పోలీసులంతా ఒక మాట మీద కూడా పలుకుకొని ఏలూరు పరిసర ప్రాంతాల్లో చనిపోయిన కూడా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి అక్కడే పోస్టుమార్టం జరిపించారు.

ఇక్కడ ఏలూరులో చనిపోతే విజయవాడ వరకు తీసుకెళ్లడానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి మా దళిత సోదరులు ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకుంటాయి అని వాటిని అణచివేయటం కోసం ఆడిన డ్రామా లు ఇవి. హోం మంత్రి తానేటి వనితనియోజకవర్గంలోని దొమ్మేరు గ్రామంలో బొంత మహేందర్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడటానికి వైసీపీనేతల అధికార మదమే కారణం.

మహేందర్ కుటుంబం గతంలో తానేటివనిత గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేసింది. స్వయంగా ఆమెకు అనుచరుడిగా ఉండే మహేందర్ ప్రాణాలకే రక్షణ లేకపోతే.. ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. గతంలో రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలే ఇందుకు నిదర్శనం.

ముఖ్యమంత్రిది తమ కులమని.. తమపార్టీ… తమ ప్రాంతమన్న అహంకారంమే రాష్ట్రంలో దళితులు..ఇతర వర్గాలను బలితీసుకుంటోంది. డాక్టర్ సుధాకర్ నుంచి ఇటీవల కంచికచర్లలో దళితయువకుడిపై మూత్రం పోసిన ఘటన వరకు అన్నింటికీ జగన్ రెడ్డి, వైసీపీనేతలు, మంత్రుల అహంకారపూరిత అధికారదర్పమే కారణం. ఆ దర్పానికే నెల్లూరులో నారాయణ అనే దళితుడు పోలీసులు చిత్రహింసల వల్ల చనిపోయాడు.

కర్నూల్లో దళిత యువకుడిని పోలీ సులు దొంగతనం నేరంపై స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలకు గురిచేయడంతో అవమానభారంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దళితుల ఆత్మహత్యలు.. హత్యలు ముమ్మాటికీ వైసీపీప్రభుత్వ చర్యలు..అధికారపార్టీ నేతల దౌర్జన్యం.. పోలీస్ శాఖ వైసీపీనేతలకు వత్తాసు పలకడం వల్ల జరుగుతున్నవే. ముఖ్యమంత్రి తమ వెనకున్నాడన్న ధైర్యంతోనే.. వైసీపీనేతలు దళిత..బీసీ..మైనారిటీలపై దమనకాండకు పాల్పడుతున్నారు.

దళిత..బీసీ..మైనారిటీలపై సాగుతున్న దమనకాండకు… వైసీపీ నేతల దుర్మార్గాలకు కారణం ముఖ్యమంత్రి అండదండలే. పోలీస్ శాఖ ఇప్పటికైనా చట్టప్రకారం వ్యవహరించి.. వైసీపీ నేతలపై కఠినంగా వ్యవహరించాలి.నిత్యం దళితులపై దమన కాండకు పాల్పడుతున్న జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం సామాజిక సాధికార యాత్ర పేరుతో దళితుల జపం చేయడం సిగ్గుచేటని, నాలుగేళ్ల 8 నెలల జగన్ పాలనలో ఇప్పటివరకు 6వేలకు పైగా ఎస్సీలపై దాడులు జరిగాయి వైసీపీప్రభుత్వ దౌర్జన్యకాండ కొనసాగుతోందని, ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖ అధికారపార్టీ నేతలకు వంతపాడుతోంది.

ముఖ్యమంత్రిది తమ కులమని.. తమపార్టీ… తమప్రాంతమన్న అహంకారంమే రాష్ట్రంలో దళితులు..ఇతర వర్గాలను బలితీసుకుంటోంది. కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై మూత్రంపోసిన హర్షవర్థన్ రెడ్డికి పోలీసుల మద్థతు.. అధికారపార్టీ నేతల సపోర్ట్ ఉందన్నది నిజం కాదా? తన అనుచరుడు మహేందర్ ని కాపాడలేని హోంమంత్రి తోటి దళితుల్ని కాపాడుతుందా?

దళితజాతిపై సాగుతున్న దమనకాండకు… వైసీపీ నేతల దుర్మార్గాలకు కారణం ముఖ్యమంత్రి అండదండలే. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వైసీపీ నేతల దౌర్జన్యాలకు గురి అవుతున్న దళితుల మానప్రాణాలకు విలువ కట్టి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రిని నాగార్జున ని ప్రశ్నిస్తున్నా?. ముఖ్యమంత్రికి దళితులపై వారి ప్రాణాలపై ఉన్న ప్రేమ.. అభిమానం.

దళితుల మరణాల పై విచారణ కమిషన్ ను నియమించలేని మేరుగ నాగార్జున దళితుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. బొంతు మహేందర్ ని ఎందుకు స్టేషన్ కు పిలిపించారని తన పరిధిలోని పోలీసుల్ని ప్రశ్నించలేని తానేటి వనిత హోంమంత్రా? ఇలాంటి మంత్రులు దళితసమాజానికి, అవసరమా? ఇలాంటి చేతగాని చేవలేని మంత్రులు మరలా సిగ్గులేకుండా సామాజిక సాధికార బస్సుయాత్ర పేరు తో సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారు.

బొంతు మహేందర్ కుటుంబానికి వెంటనే 50 లక్షల పరిహారం అందచేయాలి అంతే కాకుండా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరపున రావలసిన ఆర్థిక సహాయం వెంటనే అందచేయాలి అని డిమాండ్ చేస్తున్నాను.ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా నిందితులకు వెంటనే శిక్ష వేసి మహేందర్ కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము.. దళిత..బీసీ..మైనారిటీ వర్గ మంత్రుల్ని ఉత్సవవిగ్రహాలుగా ఉన్నారు అనేది ఎవరూ కాదనలేని సత్యం.

కనీస ఆత్మగౌరవం..కనీస స్వాభిమానం లేని దళిత మంత్రులు తమవర్గాలను ఏం రక్షిస్తారు? దళితులకు జగన్ తీవ్ర అన్యాయం చేశాడు. ఇప్పటికైనా దళిత.. బీసీ..మైనారిటీ మంత్రులు కనీస ఆత్మగౌరవంతో వ్యవహరిస్తేనే తమతమ వర్గాలకు నిజమైన సాధికారతనే వాస్తవం గ్రహించాలి.

LEAVE A RESPONSE